Shree Ram Rath Yatra: అష్టలక్ష్మీ ఆలయంలో వైభవంగా శ్రీరాముని రథయాత్ర..

|

Jan 22, 2024 | 10:55 AM

అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. యావత్ భారతదేశంలోని వాడవాడలా రామనామం మారుమోగుతోంది. వాడవాడలా ఆథ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ఏ వీధిలో చూసిన రామ నామ గానామృతమే..అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ కళకళలాడుతున్నాయి.

Shree Ram Rath Yatra: అష్టలక్ష్మీ ఆలయంలో వైభవంగా శ్రీరాముని రథయాత్ర..
Shree Ram Rath Yatra
Follow us on

అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. యావత్ భారతదేశంలోని వాడవాడలా రామనామం మారుమోగుతోంది. వాడవాడలా ఆథ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ఏ వీధిలో చూసిన రామ నామ గానామృతమే..అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ కళకళలాడుతున్నాయి. శ్రీమన్నారాయణుడు బాలరాముడిగా ఈ కలియుగానికి వేంచేస్తున్నాడా అనిపిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ కొత్తపేటలోని అష్టలక్ష్మీ ఆలయంలో శ్రీసీతారామచంద్రమూర్తికి రథోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు.

Shree Ram Rath Yatra

కొత్తపేట అష్టలక్ష్మీ దేవాలయము, తత్త్వం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ రామచంద్ర స్వామి వారి రథయాత్రఅంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన రథయాత్ర, పురవీధుల్లో జైశ్రీరామ్ నినాదాలతో కొనసాగింది. భగవత్ బంధువులందరూ శ్రీరామనామ సంకీర్తనలతో శోభాయాత్రగా స్వామివారి రథం వెంటసాగారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా రథయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అష్టలక్ష్మి దేవాలయం చైర్మన్ రమేష్ గుప్తా తెలిపారు.

శ్రీరామచంద్రుడు తేత్రాయుగంలో 14 సంవత్సరాల వనవాసం చేస్తే కలియుగంలో 500 ఏళ్ళు పైగా వనవాసం చేయాల్సి వచ్చిందని, ఏమైనా ఈరోజు జరిగే చారిత్రాత్మక ఘట్టానికి మనం నిదర్శనంగా ఉండడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు.

మరిన్ని అయోధ్య రామాలయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..