Ayodhya Ram Janmabhoomi: హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు పుట్టిన భూమి అయోధ్య (ayodhya)ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి శర వేగంగా రెడీ అవుతుంది, రామయ్య జన్మించిన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చెందిన ౩ డీ వీడియో ఒకటిగురువారం నాడు రామ జన్మ భూమి ట్రస్ట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో జరుపుకునే భోగి( Bhogi)పండగను.. ఉత్తరాదివారు లోహ్రి (Lohri)గా జరుపుకుంటారు. ఈ లోహ్రి పండగ సందర్భంగా రామయ్య మందరి నిర్మాణం జరుగుతున్న తీరుపై అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఓ వీడియోని రిలీజ్ చేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రక్రియను వివరంగా వివరించే 3డి యానిమేషన్ వీడియోను ట్విటర్ వేదికగా షేర్ చేసింది. రామ మందిరం పునాది నుంచి మందిరం పై కప్పు వరకూ చూపిస్తూ.. భక్తులకు కనుల విందు చేశారు. ఐదు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేకతలు, సాంకేతికతలను చిత్రీకరించారు. 5 నిమిషాల పాటు మందిరం చూస్తూ మైమరచిపోయెలా చేశారు. ఈ వీడియో లో ఏరియల్ వ్యూ గా ఆలయానికి చేరుకునే రోడ్డు మార్గం, గతంలో కట్టిన శ్రీరామ మందిరంతో పాటు ప్రస్తుతం నిర్మిస్తోన్న రామ మందిరం.. వంటి దృశ్యాలు కనుల విందు చేస్తున్నాయి. రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, అది త్వరలో సిద్ధమవుతుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలియజేసింది. భక్తులందరికీ త్వరలో దర్శనం కోసం తలుపులు తెరుస్తాం’’ అని ట్వీట్ చేసింది.
జనవరి 2021లో ప్రారంభమైన ఆలయ నిర్మాణం కోసం భూమి తవ్వకం ప్రక్రియను టైమ్‌లైన్‌ను వివరిస్తూ.. ట్రస్ట్ విడుదల చేసిన 3డి విజువలైజేషన్ ఆలయం ఎంత ఖచ్చితంగా నిర్మించబడుతుందో స్పష్టం చేస్తుంది. ఈ ఆలయాన్ని 10 ఎకరాల్లో నిర్మించనున్నారు. 57 ఎకరాల స్థలంలో ప్రార్థనా మందిరం, ఉపన్యాస మందిరం, స్కూల్స్, మ్యూజియం, ఫలహారశాల వంటి ఇతర సౌకర్యాలతో కూడిన కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయనున్నారు.
మందిర నిర్మాణం కోసం తవ్వకాలు జనవరి 2021లో ప్రారంభమయ్యాయి.. మార్చి 2021లో పూర్తయ్యాయి. ఈ స్థలాన్ని 5 జోన్‌లుగా విభజించారు. ఈ ఆలయంలో మొత్తం 360 నిలువు వరుసలు ఉన్నాయని. ఒక్కో దానిలో శివుని అవతారాలు, దశావతారాలు, సరస్వతి దేవి 12 అవతారాలు వంటి అనేక విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.
अयोध्या स्थित भगवान श्री राम की पावन जन्मभूमि पर बन रहे भव्य श्रीराम जन्मभूमि मन्दिर के निर्माण की सम्पूर्ण प्रक्रिया को एक 3डी फ़िल्म के माध्यम से हमने प्रस्तुत करने का प्रयास किया है।
जय श्री राम!https://t.co/9h84RtuAD0— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 13, 2022
అహ్మదాబాద్‌లోని సోంపురా కుటుంబం 1988లో రామ మందిరానికి సంబంధించిన అసలు డిజైన్‌ను తయారు చేసింది. సోమ్‌నాథ్ ఆలయంతో సహా కనీసం 15 తరాలుగా ప్రపంచవ్యాప్తంగా 100 ఆలయాల రూపకల్పనలో సోమపురాలు భాగంగా ఉన్నాయి. ఆలయ వాస్తుని శిల్పి చంద్రకాంత్ సోంపురా సంస్థ చూసుకుంటుండగా, లార్సెన్ & టూబ్రో ఆలయ రూపకల్పన, నిర్మాణాన్ని ఉచితంగా పర్యవేక్షిస్తుంది. టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా నియమించబడింది.
సోంపురా కుటుంబం గుజరాత్‌లోని అక్షరధామ్ ఆలయం , సోమనాథ్ ఆలయాన్ని కూడా రూపొందించింది. రామమందిరాన్ని చంద్రకాంత్ భాయ్ సోంపురా , అతని కుమారులు రూపొందించారు.
రాజస్థాన్‌కు చెందిన 600 వేల క్యూబిక్ అడుగుల ఇసుకరాయి బన్సి పర్వత రాళ్లతో నిర్మాణ పనులు పూర్తకానున్నాయి. ముప్పై సంవత్సరాల క్రితం, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక భాషలలో ‘శ్రీరామ’ అని చెక్కబడిన రెండు లక్షలకు పైగా ఇటుకలు వచ్చాయి, వీటిని ఫౌండేషన్‌లో ఉపయోగించనున్నారు.
నివేదికల ప్రకారం , శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ మందిర నిర్మాణ మొదటి దశను మార్చి 2020లో ప్రారంభించింది. అయితే, కోవిడ్-19 మహమ్మారి, భారతదేశంలో లాక్‌డౌన్ తదితర కారణాలతో నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. అయితే 5 ఆగస్టు 2020న ప్రధాని మోడీ భూమి పూజా కార్యక్రమం తర్వాత ఆలయ నిర్మాణం అధికారికంగా మళ్లీ ప్రారంభమైంది. భూమి పూజకు ముందు మూడు రోజుల పాటు వైదిక కర్మలు జరిగాయి, ఇది 40 కిలోల వెండి ఇటుకను ప్రధాని మోడీ పునాది రాయిగా అమర్చారు.
అయోధ్యలో రామమందిరం మూడేళ్లలో సిద్ధమవుతుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గతంలో ప్రకటించింది. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేజ్-1, ఫేజ్-2 పనులు పూర్తవ్వగా.. డిసెంబర్ 2023 నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పేర్కొంది.
Also Read: