హస్త నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహము. రాశి అధిపతి బుధుడు. అధిదేవత సూర్యుడు. జంతువు – మహిషి(గేదె). ఈ నక్షత్రజాతకులు మంచి ఆకర్షణ కలిగి ఉంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్ధము చేసుకుంటారు. అడగగానే సహాయము చెస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారి రాశి కన్యారాశి ఉంటుంది. హస్త నక్షత్రానికి జ్యోతిష్యశాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. హస్తం అంటే చేయి.. జ్యోతిష్యులు మన చేయిని చూసి మన జాతకాన్ని చెబుతారు. చేతిలో అభయ ముద్ర ఉంటుంది. ఇది సూర్యుడిని పోలి ఉంటుంది. ఇక మూసి పిడికిలి గోప్యత, లాభానికి సూచనగా పేర్కొంటారు. హస్త అనే పదం హస్త్ అనే పదం నుంచి ఉద్భవించింది.
ఇదిలాఉంటే.. హస్త నక్షత్రంలో జన్మించిన వారి జీవితంలో వైభవంగా ఉంటుంది. వీరు అన్నింటిలోనూ రాణిస్తారు. సాంకేతికంగా చాలా ప్రతిభావంతులు. వీరిలో మెకానికల్ ఆర్ట్ చాలా ఉంటుంది. క్రీడల పట్ల మంచి ఆసక్తి కలిగి ఉంటారు. ఈ రాశిలో చిన్మించిన వారిని చిన్నతనం నుంచి క్రీడల్లో ప్రోత్సహిస్తే.. భవిష్యత్‌లో మంచి క్రీడాకారులుగా రాణించే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రం వారు స్వతహాగా చాలా ఫన్నీగా ఉంటారు. విషాద పరిస్థితులలోనూ ఉత్సాహాన్ని నింపుతారు. కష్టమైన పనులను సైతం చాలా ఈజీగా, సంతోషంగా పూర్తి చేస్తారు. వీరికి ఖాళీగా కూర్చోవడం అస్సలు ఇష్టం ఉండదు. ప్రతి సెకన్‌ను చాలా సమర్థంగా వినియోగించుకుంటారు.
ఈ నక్షత్రంలో జన్మించిన వారు.. తమ లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించరు. కొన్నిసార్లు వారి హాస్య స్వభావాన్ని చూసి.. అందరూ వారిని లైట్ తీసుకుంటారు. కానీ, వారు అలా కాదు. ఎంత హ్యాస్యపూరితమైనప్పటికీ.. లక్ష్యంపైనే వారి దృష్టి ఉంటుంది. హస్తానక్షత్రం ఉరన్న వ్యక్తి.. ఇంజనీర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాడైపోయిన, కరాబైన వాటిని సరి చేయడం వారిలో ప్రత్యేక లక్షణం. ఇలాంటి వ్యక్తులు తమ ఎదుటి వ్యక్తి నుంచి రహస్యాలను చాలా ఈజీగా రాబట్టగలుగుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..