హిందూ సనాతన ధర్మంలో రోజువారీ కార్యకలాపాలన్నింటికీ నియమాలు ఉన్నాయి. ఉదయం లేచినప్పటి నుండి, పూజలు చేసే సమయం, స్నానం, భోజనం వరకు అనేక నియమాలు ఉన్నాయి. ఆహారం, ధాన్యాలు దేవతలతో సమానంగా పరిగణించబడతాయి. అయితే చాలామంది తినే ఆహారాన్ని గౌరవించినా అదే సమయంలో మనలో చాలా మంది ఆహారానికి తగిన గౌరవం చూపరు. ఉదాహరణకు ఆహారం తిన్న తర్వాత ఒకే ప్లేట్‌లో చేతులు కడుక్కోవడం చాలాసార్లు చూసే ఉంటారు. అయితే సనాతన ధర్మం ప్రకారం ఆహారం తిన్న ప్లేట్‌లో చేతులు కడుక్కోవడం చెడు శకునంగా కనిపిస్తుంది. ఇలా చేస్తే అన్నపూర్ణ దేవి ఆగ్రహించి కుటుంబం మొత్తం మీద చెడు ప్రభావం చూపుతుందని నమ్ముతారు.
అన్నపూర్ణ దేవి ఎవరి చర్యలకైనా కోపగించుకుంటే అది వారికి చెడ్డ రోజులకు నాంది అని పురాణ గ్రంధాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సందర్భంలో వ్యక్తి జీవితంలో పేదరికాన్ని అనుభవించడం ప్రారంభిస్తాడు. ఏదైనా విషయం పట్ల గౌరవం పొందాలనుకుంటే దానికి గౌరవం ఇవ్వడం తప్పని సరి. ఆహారానికి సంబంధించిన కొన్ని నియమాలు.. ఆహారాన్ని ఎలా గౌరవించాలో తెలుసుకుందాం.
అన్నింటిలో మొదటిది ఆహారం అందిస్తున్నప్పుడు.. ఎల్లప్పుడూ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మరో మాటలో చెప్పాలంటే.. ప్లేట్‌లో వడ్డించే ఆహారం పట్ల వినయవిధేతలు చూపించాలి. అదే సమయంలో ఎంత తినగలరో అంతే ఆహరం ప్లేట్ లో పెట్టుకోవాలి. తినే ఆహారాన్ని వృధా చేయకూడదు.
పురాణాల ప్రకారం ఆహారాన్ని అవమానించడం మహా పాపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎవరైనా తమ ప్లేట్‌లో ఎంత ఆహారం తీసుకుంటారో అంత మాత్రమే తీసుకోవాలని చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. మీరు ప్లేట్‌లో ఆహారాన్ని వృధా చేసినప్పుడల్లా అన్నపూర్ణ దేవి చాలా కలత చెందుతుంది.. కోపంతో మిమ్మల్ని శపిస్తుంది. దీంతో జీవితంలో దురదృష్టాన్ని తెస్తుంది. అంతేకాదు తినే భోజన సమయాన్ని .. భోజనం చేసి రోజుని దాటవేయకుండా చూసుకోవాలి. ఒకసారి భోజనం మానేయడం మొదలు పెడితే .. అది తర్వాత అలవాటుగా మారవచ్చు. మళ్ళీ మళ్ళీ భోజనం చేసే ప్లేట్ నుంచి మధ్యలో లేస్తారు. లేదా భోజనం చేయడం మానెయ్యడం అనేది మళ్లీ మళ్లీ చేస్తారు. ఇలా చేయడం లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు. ఇలా చేస్తే ఆ వ్యక్తి పేదరికం, జీవితంలో డబ్బు కొరతతో బాధపడుతుంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైనా ఆహారం తిన్న తర్వాత ఆ ట్‌లో చేతులు కడుక్కుంటే.. సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి.. అన్నపూర్ణ దేవికి చాలా కోపంగా ఉంటారు. తిన్న తర్వాత ప్లేట్‌లో చేతులు కడుక్కోకూడదని అంటారు. ప్లేట్‌లో చేతులు కడుక్కోవడం ద్వారా, దానిలో మిగిలిన ఆహారాన్ని అగౌరవపరిచారు. ప్రతి మెతుకుని గౌరవించాలి.
ఎల్లప్పుడూ గౌరవప్రదంగా తినే ఆహారం ప్లేట్ ను ఉంచండి. అంతేకాదు తినే ఆహారం ప్లేట్‌ను ఎప్పుడూ ఒక చేత్తో పట్టుకోకూడదు. అదే సమయంలో ప్లేట్‌లో తినే ఆహారం మిగిలిపోయే విధంగా పెట్టుకోవద్దు.. లేదా తినే ఆహారాన్ని ప్లేట్ లో వదిలివేయడం కూడా అశుభంగా పరిగణించబడుతుంది.
భోజనం చేసే ముందు అన్నపూర్ణమ్మని ధ్యానించాలని శాస్త్రాలలో చెప్పబడింది. ఆహారం తినే సమయంలో కోపంతో ఉండడం, మాట్లాడడం, వింత శబ్దాలు చేయకూడదని అంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)