Goddess Laxmi: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి..

Goddess Laxmi: ప్రశాంత జీవితం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. ప్రశాంత జీవితం కోసం ప్రజలు ఎంతో కష్టపడుతుంటారు.

Goddess Laxmi: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి..
Goddess Laxmi
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 06, 2022 | 4:57 PM

Goddess Laxmi: ప్రశాంత జీవితం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. ప్రశాంత జీవితం కోసం ప్రజలు ఎంతో కష్టపడుతుంటారు. ఆర్థిక సమస్యలను నివారించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. అయితే, కొన్నిసార్లు ఎంత కష్టపడి పని చేసినా.. ఫలితం లేకుండా పోతుంది. ఆర్థికంగా చితికిపోతుంటారు. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అధికంగా ఉంటుంది. దాంతో నిరాశ, నిస్పృహలో కూరుకుపోతారు. శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, జ్యోతిష్యం ప్రకారం.. కొన్నిసార్లు కష్టపడి పని చేయడంతో పాటు అదృష్టం కూడా ముఖ్యం. దేవతామూర్తుల ఆశీస్సులు ఉండటం కూడా ముఖ్యం. దేవతల ఆశీస్సుల కోసం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నివారణ చర్యలు ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయాన్నే లేచి ఇలా చేయండి.. ప్రతి రోజూ ఉదయం స్నానం చేసిన లక్ష్మీ దేవిని పూజించాలి. లక్ష్మీ దేవి ఆరాధన చేయాలి. లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలను పఠిస్తూ, చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించాలి.

మోకాళ్లపై కూర్చుని.. మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించాలి. భూమి మన భారాన్ని మోస్తున్నందున.. భూదేవికి నమస్కరించాలి.

ఉప్పు నీటితో ఫ్లోర్‌ను క్లీన్ చేయాలి.. వాస్తు ప్రకారం.. ఇంట్లో శాంతి, శ్రేయస్సు కోసం సూర్యోదయానికి ముందు ఉప్పు నీటితో మొత్తం ఇంటిని క్లీన్ చేయాలి.

సూర్య భగవానుడికి నైవేద్యాలు సమర్పించాలి.. సూర్యోదయానికి ముందే లేచి పనులన్నీ చేసి స్నానం చేయాలి. ఆ తరువాత ఎర్రటి పూలు, వెర్మిలియన్ మొదలైన వాటిని రాగి పాత్రలో నీటితో ఉంచి సూర్య భగవానుడికి నమస్కరించాలి. ‘ఓం సూర్యాయ నమః’ అని జపించాలి.

తులసి చెట్టుకు నీరు పోయాలి.. సూర్యభగవానునికి నీళ్లతో పాటు తులసి చెట్టుకు కూడా నీరు పోయాలి. అదే సమయంలో నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. తులసికి నీరు పోసే సమయంలో శ్రీ హరి మంత్రాన్ని(ఓం నమో భగవతే వాసుదేవాయ) కూడా జపించాలి.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, మత గ్రంధాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..