Astro Tips: హిందూమతంలో.. దేవుళ్ళ అనుగ్రహం పొందడానికి పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తారు. మరికొందరు కొందరు దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాస పద్ధతిని కూడా అవలంబిస్తారు.అయితే దేవతలను త్వరగా ప్రసన్నం కావడానికి మరొక మార్గం ఉంది.. అదే దానం చేయడం. సనాతన ధర్మంలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత (Donation astro benefits) ఉంది. నాలుగు యుగాలలోని వివిధ దానాల లక్షణాలను వివరించింది. సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరంలో యాగం .. కలియుగంలో కేవలం దానం మాత్రమే వ్యక్తిని క్షేమంగా సుఖ సంతోషాలతో ఉంచగలదు. దానధర్మాలు చేయడం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతోంది. ప్రజలు తమ పూర్వీకులను ( Pitra dosh) సంతోషపెట్టడానికి కూడా దానం చేస్తారు. వాస్తు, జ్యోతిష్య శాస్త్రంలో దానం చేయడం చాలా శ్రేయస్కరం అని చెప్పబడినప్పటికీ.. దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.
ఈ నియమాలను ఉల్లంగించి దానం చేస్తే.. అది ఆ ఇంట్లో వివాదాలు ఏర్పడడానికి కారణం అవుతుంది. పేదరికాన్ని కలిగిస్తుంది. ప్రజలు కొన్నింటిని ఎలాంటి ఆలోచనలు చేయకుండా దానం చేస్తారు, అది వారికి హాని కలిగిస్తుంది. కనుక ఈరోజు దానం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలను దానం చేసే వస్తువులను, దానం చేయకూడని వాటి తెలుసుకుందాం..
ఎటువంటి ఆహారపదార్ధాలను దానం చేయకూడదంటే..
పురాణాల్లో ఆకలి అన్నవారికి ఆహారం, దాహార్తితో ఉన్నవారికి నీరు దానాన్ని మహదానంగా పేర్కొన్నారు. అయితే వాటి కోసం సరైన పద్ధతిని అవలంబించడం అవసరం. ఇంటికి వచ్చే సాధు సన్యాసులకు తమ ఇంట్లో.. తాము తినగా మిగిలిన ఆహారాన్ని దానం చేయడం అశుభమని జ్యోతిష్యం పేర్కొంది. ఇతరుల ఆకలిని తీర్చడానికి చేసే ఆహార పదార్ధాల దానం ఎప్పుడూ పరిశ్రభంగా తాజాగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో అదృష్టం వెల్లివిరుస్తుంది.
స్టీల్ పాత్రల దానం:
తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి కొంతమంది స్టీల్ పాత్రలను తమ పూర్వీకుల పేరుతో దానం చేస్తారు. అయితే ఇలా చేయడం జ్యోతిష్యం ప్రకారం సరైనది కాదు. స్టీల్ వస్తువులను దానం చేయడం కుటుంబ సభ్యుల ఆనందం, శ్రేయస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీరు పేదలకు ఏదైనా దానం చేయాలనుకుంటే.. ముందుగా పండితులను సంప్రదించండి.
పుస్తకాల విరాళం
జ్ఞానం లేకుండా దానం చేయడం వల్ల హాని కలుగుతుంది. అవసరమైన వారికి పుస్తకాలు, గ్రంథాలు మొదలైన వాటిని దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే విద్యార్థికి చదువుకోవడానికి ఇచ్చే పుస్తకాలు చదువుకోవడానికి వీలుగా ఉండేవి ఇవ్వాలి.. చిరిగిపోయినవి చదువుకోవడానికి వీలుకానివి ఇవ్వడం మంచిది కాదు.. అవసరం అయితే ఆ పుస్తకాలను మరమ్మత్తు చేసిన తర్వాత వాటిని విరాళంగా ఇవ్వవచ్చు. తద్వారా అవి ఎవరికైనా ఉపయోగపడతాయి. దానం చేసేటప్పుడు వ్యక్తి .. తన ఆలోచనలు, ఎదుటివారి అవసరం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)