Astro Remedies of Salt: ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మీ అదృష్టాన్ని పెంచుతుంది.. అదెలాగో మీకు తెలుసా?..

Astro Remedies of Salt: ఆహారంలో ఉప్పు విలువైనదో అందరికీ తెలిసిందే. నల భీముడు ఎంతటి రుచికరమైన భోజనం తయారు చేసినా.. అందులో కాసింత ఉప్పు తక్కువైందంటే..

Astro Remedies of Salt: ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మీ అదృష్టాన్ని పెంచుతుంది.. అదెలాగో మీకు తెలుసా?..
Salt

Astro Remedies of Salt: ఆహారంలో ఉప్పు విలువైనదో అందరికీ తెలిసిందే. నల భీముడు ఎంతటి రుచికరమైన భోజనం తయారు చేసినా.. అందులో కాసింత ఉప్పు తక్కువైందంటే.. ఆ వంట రుచే మారిపోతుంది. అంతటి ప్రాధాన్యత ఉప్పు కి ఉంటుంది. అయితే, ఉప్పు రుచినే కాదు.. అదృష్టానికి కూడా కారణభూతమవుతుంది. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల్లో ఉప్పు ఏ రకంగా ప్రయోజనం చేకూరుస్తుందో పేర్కొనడం జరిగింది. ఉప్పు ద్వారా మీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. జీవితంలో మార్పు లేకపోవడం, డబ్బు, ఆరోగ్యం రెండింటిలోనూ బలహీనంగా మారడం వంటి జరుగుతున్నట్లయితే.. వెంటనే వంటగదిలోని ఉప్పుతో వాస్తు నివారణ చర్యలు చేపట్టండి. అలా అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు.

ఆర్థికాభివృద్ధి కోసం..
మీరు ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నట్లయితే.. మీ ఖర్చులు మీ ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే.. ఉప్పు నివారణ చర్యలు ఒక వరంగా పేర్కొనవచ్చు. దీని కోసం మీరు ఒక గ్లాస్ గిన్నెలో కొద్దిగా సముద్రపు ఉప్పును ఉంచాలి. అందులో రెండు నాలుగు లవంగాలు వేయాలి. మీ ఇంట్లో ఏదో ఒక చోట ఉంచాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వివిధ మార్గాల నుంచి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. గిన్నెలో ఉంచిన ఉప్పులో తేమ వస్తే ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి.

అనారోగ్యం నుంచి కోలుకోవడానికి..
మీ ఇంట్లోని వ్యక్తులు తరచుగా అనారోగ్యంతో ఉంటే.. లేదా ఒక వ్యక్తి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఔషధాలు ఎలాంటి ప్రభావం చూపకపోతే ఉప్పుతో ఇలా ట్రై చేయండి. బాధిత వ్యక్తి మంచం దగ్గర తలగడ సమీపంలో ఒక గాజు గిన్నె ఉంచాలి. అందులో రాతి ఉప్పును ఉంచాలి. అది తడిగా మారినప్పుడు కాలానుగుణంగా మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా త్వరగా ఆరోగ్యం కుదిట పడుతుంది.

మానసిక ఒత్తిడి, అలసట నుంచి బయటపడాలంటే..
మీ మనస్సు తరచుగా ఏదో ఒక కారణంతో కలవరపాటుకు గురవుతుంటే.. గోరువెచ్చని నీటిలో ఉప్పుతో స్నానం చేస్తే మానసిక ప్రశాంతత, శారీరక అలసట తొలగిపోతుంది.

ప్రతికూల శక్తిని తొలగించడానికి..
మీ ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిందని మీకు అనిపిస్తే.. ఎవరికీ తెలియకుండా మీ ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేయండి. అదేవిధంగా, మీ బిడ్డపై ఎవరి దృష్టి అయినా పడినట్లు అనిపిస్తే.. పిడికెడు ఉప్పు తీసుకుని తల నుంచి పాదాల వరకు ఏడుసార్లు తిప్పాలి. ఆ తరువాత ఆ ఉప్పును టాయ్‌లెట్‌లో పడేసి ప్లఫ్ చేయండి.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ప్రచురించడం జరిగింది.)

Also read:

Telangana: ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ హాల్ టికెట్స్..

Hyderabad: ‘అయ్యాయో వద్దమ్మా’ శరత్ ని చితక బాదారా?.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటోలు..

SBI Travel Card: ఎస్‌బిఐ అదిరిపోయే ఆఫర్.. ట్రావెల్‌ కార్డ్‌‌తో క్షణాల్లో 7 రకాల కరెన్సీలు విత్‌డ్రా..!

Click on your DTH Provider to Add TV9 Telugu