Gupt Navratri 2025: గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ కోరిక తీరడానికి ఏదేవతని పూజించాలంటే..

సనాతన ధర్మంలో అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది. ఏడాది పొడవునా నాలుగు రకాల నవరాత్రులను జరుపుకుంటారు. నవరాత్రులు అనగానే గుర్తుకు వచ్చేవి దేవీ శరన్నవరాత్రులు. అయితే అమ్మవారిని పూజించేందుకు చైత్ర , శారదియ, మాఘ, ఆషాఢ నవరాత్రులను జరుపుకునే సంప్రదాయం ఉంది. ఆషాడ మాసంలో జరుపుకునే మాఘ, ఆషాఢ నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. ఇవి ముఖ్యంగా ఈ నవరాత్రులను ప్రత్యెక సిద్ధులు పొందలనుకునేవారు జరుపుకుంటారు.

Gupt Navratri 2025: గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ కోరిక తీరడానికి ఏదేవతని పూజించాలంటే..
Ashadha Gupt Navratri

Updated on: Jun 27, 2025 | 2:27 PM

చైత్ర,శారదీయ నవరాత్రుల మాదిరిగా.. ఆషాడ మాసంలోని గుప్త నవరాత్రులను బహిరంగంగా జరుపుకోరు. అయితే ఈ నవరాత్రులను ప్రత్యేక సిద్ధులను పొందాలనుకునే తాంత్రికులు, అఘోరీలు, సాధకులు చాలా ముఖ్యంగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ సమయంలో దేవతను పూజించడం ద్వారా సాధారణ గృహస్థులు కూడా ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఆషాఢ మాసంలోని గుప్త నవరాత్రి గురువారం, జూన్ 26, 2025 నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ రోజు గుప్త నవరాత్రులలో రెండవ రోజు. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గామాత తొమ్మిది రూపాలను రహస్యంగా పూజిస్తారు.

గుప్త నవరాత్రులలో అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు

  1. శత్రు అడ్డంకుల నుంచి విముక్తి: దశ మహావిద్యలలో కొన్నింటిని శత్రు నాశనకారులుగా పరిగణిస్తారు. వీటిని పూజించడం వల్ల శత్రువులను ఓడించడంలో సహాయపడుతుంది. వాటి వల్ల కలిగే అడ్డంకులు తొలగిపోతాయి.
  2. ఆర్థిక శ్రేయస్సు: కమలా దేవి , భువనేశ్వరి అమ్మవారిని పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  3. ఆరోగ్య ప్రయోజనాలు: భగవతి దేవిని పూజించడం వల్ల శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ధూమావతి దేవిని పూజించడం వల్ల తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  4. కోరికలు నెరవేరడం: దేవతను నిర్మలమైన హృదయంతో పూజించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు దంపతులు సంతానం కోసం లేదా యువతులు వివాహానికి సంబంధించిన సమస్య లేదా ఏదైనా ఇతర వ్యక్తిగత కోరిక అయినా తీరాలంటే గుప్త నవరాత్రులలో అమ్మవారిని గుప్తంగా పూజించడం వలన ఫలితం ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. తంత్ర మంత్ర సిద్ధి: ఈ నవరాత్రి తాంత్రిక, మంత్ర సాధనలకు ప్రత్యేకంగా ఫలవంతమైనది. ఈ కాలంలో చేసే సాధనలు విజయవంతమవుతాయి. అభ్యాసకుడికి అతీంద్రియ శక్తులను అందిస్తాయి.
  7. ప్రతికూల శక్తి నుంచి రక్షణ: గుప్త నవరాత్రి సమయంలో చేసే పూజలు ఇల్లు, జీవితం నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. తద్వారా సానుకూలతను వ్యాపింపజేస్తాయి.
  8. ఆధ్యాత్మిక శాంతి, మోక్షం: దేవత పట్ల భక్తి మనశ్శాంతిని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక పురోగతికి మార్గాన్ని తెరుస్తుంది. ఇది చివరికి మోక్షానికి దారితీస్తుంది.

గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి?

  1. గుప్త నవరాత్రి ఆచారాలను రహస్యంగా ఉంచినప్పటికీ.. సాధారణ గృహస్థులు కూడా కొన్ని సులభమైన మార్గాల్లో దుర్గాదేవి ఆశీర్వాదాలను పొందవచ్చు.
  2. వీలైతే, కలశాన్ని ప్రతిష్టించి, ప్రతిరోజూ దేవతను పూజించండి.
  3. దుర్గా సప్తశతి పారాయణం: ప్రతిరోజూ దుర్గా సప్తశతి పఠించండి లేదా వినండి.
  4. దేవి మంత్రాల పఠనం: మీ కోరిక మేరకు ఏదైనా అమ్మవారికి సంబంధించిన మంత్రాలను పఠించండి. ‘ఓం దుం దుర్గాయై నమః’ లేదా ‘ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’ వంటివి
  5. దశ మహావిద్య స్తోత్ర పారాయణం: మీకు మహావిద్యల గురించి తెలిస్తే వాటికి సంబంధించిన స్తోత్రాలను పఠించవచ్చు.
  6. సాత్వికంగా ఉండండి: ఈ తొమ్మిది రోజులు సాత్విక ఆహారం తినండి. కోపం, ఇతరులతో వివాదం కలహాలు వంటి తామసిక ధోరణులకు దూరంగా ఉండండి.
  7. రహస్య దానం: ఈ సమయంలో రహస్యంగా దానం చేయడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

గుప్త నవరాత్రి ప్రాముఖ్యత

గుప్త నవరాత్రులలో పది మహావిద్యలైన కాళి, తారా దేవి, త్రిపుర సుందరి, భువనేశ్వరి, ఛిన్నమస్తా, త్రిపుర భైరవి, ధూమావతి, బగ్లముఖి, మాతంగి , కమలా దేవిని పూజిస్తారు. బహిరంగంగా చేయలేని రహస్య సాధనలకు ఈ సమయం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చేసే సాధనలు త్వరిత ఫలితాలను ఇస్తాయని, భక్తుల కోరికలు త్వరలో నెరవేరుతాయని నమ్ముతారు. ఈ గుప్త నవరాత్రుల ప్రధాన లక్ష్యం రహస్య సిద్ధులను సాధించడం, తంత్ర మంత్రాలను ఆచరించడం, అంతర్గత శక్తిని మేల్కొల్పడం. ఈ సిద్ధుల పట్ల ఆసక్తి లేని భక్తులు దుర్గాదేవి పది రూపాలను పూజించడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని, ప్రాపంచిక సమస్యల నుంచి విముక్తిని పొందవచ్చు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు