
అరుల్మికు శివన్ టెంపుల్ స్విట్జర్లాండ్‌లోని గ్లాట్‌బ్రగ్ మునిసిపాలిటీలో ఉంది. అక్కడే దేవాలయాల విస్తరణలో భాగంగా మరో భారీ హిందూ టెంపుల్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 20 అడుగుల ఎత్తులో రాజగోపుర నిర్మాణం తలపెట్టారు. జ్యూరిచ్ విమానాశ్రయం సమీపంలో దీని కోసం స్థల సేకరణ చేశారు. మార్చి 22 నుంచి 24 తేదీ వరకు భూమి పూజ.. వేద పఠనం, లలితా సహస్రనామ పారాయణం.. వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు.
ఇప్పటికే అక్కడి శివాలయాన్ని “ఉలకత్ శైవత్ తమిజ్ సంగం” నిర్వహిస్తోంది. వారు అనేక ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడ జరిగే ఆలయ ఉత్సవాలకు సుమారు 7 వేల మంది భక్తులు హాజరవుతారు. తాజాగా ఆలయ విస్తరణకు పూనుకున్నారు. అక్కడ జరిగే కార్యక్రమాలు వివరాలు తెలుసుకోవాలన్నా లేదా లైవ్‌లో చూడాలన్నా దేవస్థానం అధికారిక వెబ్‌సైడ్… https://sivankovil.ch/ను సందర్శించండి.
లలితా సహస్రనామం ఎలా పఠించాలో దిగువ వీడియోల ద్వారా తెలుసుకోండి…