Arasavalli Temple: కన్నుల పండువగా శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం.. భారీగా భక్తుల హాజరు

|

Apr 02, 2023 | 7:02 AM

చైత్ర శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి శ్రీ ఉషాపద్మినీచ్చాయాదేవీలతో కళ్యాణ మహోత్సవము అత్యంత ఘనంగా జరిగింది. ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వా రిఆలయ అర్చకులు, వేదపండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా కళ్యాణం జరిగింది.

Arasavalli Temple: కన్నుల పండువగా శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం.. భారీగా భక్తుల హాజరు
Arasavalli Sun Temple
Follow us on

భారతదేశంలో ఉన్న సూర్య క్షేత్రాలలో శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారు ప్రత్యక్ష దైవంగా పూజలను అందుకుంటున్నారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి వార్షిక కల్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. శనివారం చైత్ర శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి శ్రీ ఉషాపద్మినీచ్చాయాదేవీలతో కళ్యాణ మహోత్సవము అత్యంత ఘనంగా జరిగింది. ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వా రిఆలయ అర్చకులు, వేదపండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా కళ్యాణం జరిగింది. స్వామివారి కళ్యాణం చూసేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు.

పూర్వం హర్షవల్లి కాలక్రమేణా అరసవల్లిగా రూపాంతరం చెందింది. ఇక్కడ దేవాలయం క్రీ .శ 7 వ శతాబ్దనికి చెందినట్లుగా స్థల పురాణం. ఇక్కడ సూర్యనారాయణ స్వామిని దేవతలకు అధిపతి దేవేంద్రుడు ప్రతిష్టించారని స్థల పురాణం. ఏడాదిలో రెండు రోజులు  ప్రభాత భాస్కరుని సూర్య కిరణాలు నేరుగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి పాదాలను తాకుతాయి. ఈ అద్భుతాన్ని చూడటానికి దూర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు. మార్చి, అక్టోబర్ లో వచ్చే ఈ శుభ దినాలు ఉత్తరాయన్ని, దక్షిణాయాన్ని ప్రసరిస్తాయి. ఈ సమయంలో ప్రసరించే సూర్య కిరణల్లో శరీర ఆరోగ్యాన్నిమెరుగు పరిచే మహిమ వుందని భక్తుల నమ్మకం. శ్రీ సూర్యనారాయస్వామి ఆలయ క్షేత్ర పాలకుడు రామలింగేశ్వరస్వామి. ప్రతి ఏడాది రథ సప్తమి రోజున సూర్యనారాయణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..