Antarvedi: వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం.. నేడు రథోత్సవం..

| Edited By: Surya Kala

Feb 20, 2024 | 12:56 PM

భీష్మ  ఏకాదశిని గోదావరి జిల్లాల్లో అంతర్వేది ఏకాదశిగా పిలుస్తారు. అంతగా ప్రాముఖ్యం ఉంది మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి. ఈ రోజున దక్షిణ కాశీగా పేరుగంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల వేద మంత్రోశ్చరణలు, భక్తుల జయ జయ ద్వానాల మధ్య స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది.

Antarvedi: వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం.. నేడు రథోత్సవం..
Antarvedi Sri Lakshmi Narasimha Swamy Kalyanam Held Grandly In Konaseema District
Follow us on

అంబెడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం వైఖానస ఆగమనానుసారం ఆరుద్ర నక్షత్ర యుక్త వృచ్చిక లగ్నం శుభఘడియల్లో వివాహ ఘట్టం వైభవంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి వారి కళ్యాణాన్ని కనులారా తిలకించి పులకించారు. తొలుత శ్రీదేవి, భూదేవి సమేత నారసింహున్ని ముత్యాల పల్లకిలో కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం ప్రారంభమైన కళ్యాణ క్రతువు ఘనంగా సాగింది. దివ్య ముహూర్త సమయమైన రాత్రి 12గం 29 నిమిషాలకు దేవతామూర్తుల శిరస్సు పై జీలకర్ర బెల్లం పెట్టారు. మంగళ సూత్ర ధారణను పండితులు రమణీయంగా సాగించారు. తలంబ్రాల ఘట్టాన్ని భక్తిశ్రద్దలతో నిర్వహించారు.

భద్రాచలం తరువాత బహిరంగంగా అశేష భక్త జనం మద్య కళ్యాణం నిర్వహించడం అంతర్వేది లోనే కావడం విశేషం. కళ్యాణం ఆద్యంతం భక్తులు భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు కళ్యాణ ప్రాకారంలోనే కాక ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన LED స్క్రీన్ లపై కూడా కళ్యాణాన్ని తిలకించారు భక్తులు.. ఆలయ అనువంశిక ధర్మకర్త మొగల్తూరు రాజ వంశీయులు శ్రీ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహుద్దూర్ స్వామి పట్టు వస్త్రాలు అందించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి చెల్లుబోయిన వేణు దంపతులు, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి టిటిడి బోర్డు సభ్యులు మేకా శేషుబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, జిల్లా కలక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ శ్రీధర్, స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఇవి కూడా చదవండి

ఈరోజు కీలక ఘట్టమైన స్వామివారి రథయాత్ర జరగనుంది. తెల్లవారుజాము నుంచి సముద్ర స్నానాలు చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. 1300 మంది పోలీసులు ఎక్కడెక్కడ పహారా కాస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు అంతర్వేది పురవీధులన్ని నమో నరసింహ.. అంటూ మారుమోగుతున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..