రాఖీ పండగ వలెనే అన్నా చెల్లెళ్ళ పండగ కూడా సోదర-సోదరి బంధానికి అంకితం చేయబడింది. ఈ ఏడాది భాయ్ దూజ్ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళ పండగను నవంబర్ 3న జరుపుకోనున్నారు. ఈ రోజు సోదరి తన సోదరుడికి తిలకం దిద్ది తన సోదరుడు దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటుంది. అన్నా చెల్లెళ్ళ పండగ రోజున ప్లేట్‌లో ఏ వస్తువులు ఉంచాలి? సోదరుడికి తిలకం ఎలా దిద్దలో ఈ రోజు తెలుసుకుందాం..
ఐదు రోజుల దీపాల పండుగ ప్రతి సంవత్సరం ధన త్రయోదశి నుండి ప్రారంభమవుతుంది. కాగా ఐదు రోజుల దీపావళి పండుగలో అన్నా చెల్లెల పండగ కూడా ఒకటి. ఈ పండుగ సోదర సోదరీమణులకు అంకితం చేయబడింది. ఎందుకంటే ఈ పండుగ అన్నదమ్ముల అక్కాచెల్లెళ్ల ప్రేమకు చిహ్నం. ఈ రోజున సోదరీమణులందరూ తమ సోదరులకు తిలకం దిద్ది భోజనం పెడతారు. తరువాత సోదరుడు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు. తన సోదరిని కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. ఈసారి దీపావళి పండుగ తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. దీంతో దీపావళి తర్వాత వచ్చే పండుగల తేదీల విషయంలో గందరగోళం నెలకొంది. అయితే ఈ ఏడాది అన్నా చెల్లెళ్ళ పండుగను నవంబర్ 3న జరుపుకోనున్నారు.
చాలా ప్రాంతాల్లో ఈ అన్నాచేలేళ్ళ పండగను యమ ద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజున వ్యాపారస్తులు చిత్రగుప్తుని పూజిస్తారు. పురాణాల ప్రకారం ఈ పండుగ యమధర్మ రాజు అతని సోదరి యమునల మధ్య ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. మీరు కూడా అన్నా చెల్లెళ్ళ పండగ రోజున మీ సోదరుడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టనున్నట్లు అయితే మీ సోదరుడికి ఎలా తిలకం దిద్దాలి.. ప్లేట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
యమ ద్వితీయ తేదీ 2024
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసం రెండవ తిది విదియ తిధి శుక్ల పక్షం నవంబర్ 2వ తేదీ రాత్రి 8:21 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిధి నవంబర్ 3 రాత్రి 7:52 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈసారి అన్నా చెల్లెళ్ళ పండగను నవంబర్ 3న జరుపుకుంటారు.
Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.