Tirumala Sarva Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త ర్శించుకునేందుకు సర్వదర్శన టోకెన్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సర్వదర్శనంతో పాటు వసతికి సంబంధించిన కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఈ మేరకు తన అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు శనివారం ఉదయం 9 గంటలకు విడుదల చేసినట్లు టీటీడీ వెల్లడించింది. రోజుకు 10వేల టికెట్లు విడుదల చేసినట్లు టీటీడీ వెల్లడించింది. దీనికి తోడు తిరుమలలో వసతికి సంబంధించిన డిసెంబర్ నెల కోటాను నవంబర్ 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. సర్వదర్శనం టోకెన్లు, వసతి కోసం భక్తులు www.tirupatibalaji.ap.gov.in లో బుకింగ్ చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.
మరోవైపు, తిరుమలకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని టీటీడీ సూచించింది. అయితే, ఇందుకు అనుగుణంగా వర్చువల్ క్యూ పద్ధతిలో భక్తులకు టికెట్లు కేటాయించినట్లు తెలిపింది. కాగా, ముందుగా వెబ్ సైట్‌లోకి ప్రవేశించినవారికి ముందుగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. దీంతో సర్వర్ డౌన్ సమస్య తప్పుతుందని టీటీడీ భావిస్తోంది.
నిమిషాల వ్యవధిలోనే 3లక్షల టోకెన్లు ఖాళీ!
ఇదిలావుంటే, శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తయ్యింది. 20 నిముషాల వ్యవధిలోనే 3లక్షల 10వేల టోకెన్లను భక్తులు పొందారు. కోటా పూర్తయినప్పటికీ సమాచారం తెలియక ఇప్పటికీ వేల సంఖ్యలో టిక్కెట్ల కోసం వెబ్‌సైట్‌లో లాగిన్ అవుతున్నారు. టీటీడీ దర్శనం కోటాను పెంచకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
Read Also…. Diabetes: చక్కర వ్యాధి ఉన్నవారు చలికాలంలో ఈ ఆహారపదార్ధాల జోలికి వెళితే డేంజర్.. జాగ్రత్త!