శ్రీశైలం మహాక్షేత్రంలో ఇవాళ నుంచి ఏప్రిల్ 10 వరకు స్వామివారి గర్భాలయ అభిషేకాలు సామూహిక అభిషేకాలు అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు తాత్కాలికంగా దేవస్థానం అధికారులు రద్దు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయానికి కన్నడ భక్తులు అధికసంఖ్యలో శ్రీశైలానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా శ్రీశైలం దేవస్థానం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే శ్రీశైలం మల్లన్న భక్తులకు క్షేత్రంలో గర్భాలయ అభిషేకాలు సామూహిక అభిషేకాలు కుంకుమార్చన పూజలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ముందస్తుగా వెళ్లడించకపోవడంతో శ్రీశైలం చేరుకున్న భక్తులు అయోమయంలో పడుతున్నారు. శ్రీశైలం దేవస్థానం అఫీషియల్ వెబ్‌సైట్ లో స్వామివారి సామూహిక అభిషేకాలు గర్భాలయ అభిషేకాలు కుంకుమార్చన పూజలు ఆన్ లైన్ లో టికెట్లు కనిపించకపోవడంతో శ్రీశైలం వచ్చిన భక్తులు నిరాశకు గురవుతున్నారు. శ్రీశైలం ఆలయంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో 6 నుంచి 10 వరకు శ్రీశైలం మహాక్షేత్రంలో స్వామివారి స్పర్శ దర్శనాలు విఐపి బ్రేక్ దర్శనాలు కూడ తాత్కాలికంగా అధికారులు రద్దు చేశారు.
భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికి స్వామివారి దర్శనం భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఇవాళ నుంచి ఏప్రిల్ 5 వరకు విడుతల వారీగా రోజుకు నాలుగు విడుతలుగా స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు వీఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతి ఉంటుందని ఏప్రిల్ 6 నుంచి 10 వరకు స్వామివారి అభిషేకాలు స్పర్శ దర్శనాల సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేసి భక్తులందరికి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని దేవస్థానం అధికారులు, ఈఓ పెద్దిరాజు భక్తులకు విజ్ఞప్తి చేశారు.