Akshaya Tritiya 2023: నేడు అక్షయ తృతీయ.. పూజ సమయం, విధానం.. బంగారం కొనేందుకు ముహర్తం ఏమిటంటే

|

Apr 22, 2023 | 7:49 AM

ఈ రోజు అక్షయ తృతీయ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మత విశ్వాసాల ప్రకారం.. అక్షయ తృతీయ రోజున పవిత్ర నదిలో స్నానం చేసే సంప్రదాయం ఉంది. అంతే కాదు ఈరోజు చేసే దానధర్మాలు, దక్షిణలు అత్యంత శ్రేయస్కరం. ఈ రోజు పూజా సమయం, పూజ విధానం ఏమిటో తెలుసుకుందాం.

Akshaya Tritiya 2023: నేడు అక్షయ తృతీయ.. పూజ సమయం, విధానం.. బంగారం కొనేందుకు ముహర్తం ఏమిటంటే
Akshaya Tritiya 3
Follow us on

హిందూ మతపరమైన దృక్కోణంలో అక్షయ తృతీయ చాలా పవిత్రమైన పండగ. ఈ రోజు చాలా  ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజు అక్షయ తృతీయగా జరుపుకుంటారు. దీనిని అఖా తీజ్ అని కూడా అంటారు. ఈ రోజున కూడా లక్ష్మీదేవిని, విష్ణువును  పూజించిన వారు సుఖ సంతోషాలను పొందుతారని నమ్ముతారు. ఈ రోజు పూజలు చేయడమే కాకుండా బంగారం కొనే సాంప్రదాయం కూడా ఉంది. ఇలా చేయడం వలన సంతోషం, అదృష్టం కూడా లభిస్తాయని నమ్ముతారు.

ఈ రోజు అక్షయ తృతీయ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మత విశ్వాసాల ప్రకారం.. అక్షయ తృతీయ రోజున పవిత్ర నదిలో స్నానం చేసే సంప్రదాయం ఉంది. అంతే కాదు ఈరోజు చేసే దానధర్మాలు, దక్షిణలు అత్యంత శ్రేయస్కరం. ఈ రోజు పూజా సమయం, పూజ విధానం ఏమిటో తెలుసుకుందాం.

అక్షయ తృతీయ శుభ సమయం
నియమ, నిబంధనల ప్రకారం అక్షయ తృతీయ రోజున పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు చేసే పూజలో కలశం ప్రతిష్టించే ఆచారం ఉందని ప్రతీతి. అటువంటి పరిస్థితిలో పంచాంగం ప్రకారం, కలశ స్థాపనకు అనుకూలమైన సమయం ఏప్రిల్ 22, 2023 ఉదయం 07:49 నుండి ప్రారంభమవుతుంది..  మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున బంగారం కొనాలనే సంప్రదాయం కూడా ఉంది. బంగారం కొనడానికి శుభ ముహూర్తం ఈ రోజు ఉదయం 07.49 ని.

ఇవి కూడా చదవండి
  1. అక్షయ తృతీయ పూజా విధానం
    ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేయండి. స్నానం చేసే ముందు నీటిలో గంగాజలం వేసుకోండి. లేదా నది స్నానం ఉత్తమం. అనంతరం శుభ్రమైన బట్టలు ధరించండి. పసుపు రంగు బట్టలు ఉంటే, ఈరోజే వాటిని ధరించండి.
  2. పూజించే ముందు, కొంత వస్త్రం లేదా ఆసనం ఏర్పాటు చేయండి. అనంతరం పూజను చేయండి. ఆసనం లేకుండా పూజిస్తే సాధకుడికి ఫలం దక్కదని నమ్మకం.
  3. పూజ కోసం ఒక ఆసనం ఏర్పాటు చేసి.. వస్త్రంతో అలంకరించండి. ఆపై ఆసనంపై విష్ణువు విగ్రహం లేదా చిత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత గంగాజలంతో విగ్రహాన్ని శుద్ధి చేయండి.
  4. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, పండ్లు, పువ్వులు మొదలైన వాటిని దేవునికి సమర్పించండి. వీలైతే, పసుపు పువ్వులను మాత్రమే సమర్పించండి. ఇలా చేయడం వల్ల విష్ణువు అత్యంత సంతృత్తి చెందుతాడని విశ్వాసం.
  5. పూజ ముగిసిన అనంతరం విష్ణువు , లక్ష్మీ దేవిలకు ఆరతినిచ్చి.. నైవేద్యం సమర్పించండి. మిఠాయిలు వంటి వాటిని స్వామికి నైవేద్యంగా పెట్టండి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)