Kalashtami Vratam: రేపు అధికమాస కాలాష్టమి వ్రతం.. గ్రహ దోషాల నివారణకు ఏ విధంగా పూజ చేయాలంటే..

|

Aug 07, 2023 | 11:02 AM

కాలాష్టమి నాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి ముందుగా స్నానమాచరించి, పూజాగదిని శుద్ధి చేసి అక్కడ పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠంపై శుభ్రమైన గుడ్డ వేసి, అక్కడ కాలభైరవుని విగ్రహాన్ని ప్రతిష్టించండి. ఈ సమయంలో కాలభైరవుడితో పాటు గణపతి, మహాదేవుని విగ్రహాలను కూడా ప్రతిష్టించాలి. ధూపం, దీపం, తమలపాకులు, పువ్వులు, స్వీట్లు మొదలైన వాటిని సమర్పించి కాలభైరవుడిని పూజించండి.

Kalashtami Vratam: రేపు అధికమాస కాలాష్టమి వ్రతం.. గ్రహ దోషాల నివారణకు ఏ విధంగా పూజ చేయాలంటే..
Kalabhairava Swami
Follow us on

హిందూ మతంలో ప్రతి నెలకు, ప్రతి రోజుకీ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల కృష్ణ పక్షంలోని అష్టమిని  కాలాష్టమిగా ఉపవాసం పాటిస్తారు. కాల భైరవుడిని పూజిస్తారు. శ్రావణ అధికమాస కాలాష్టమి వ్రతం రేపు అంటే ఆగస్టు 8న ఆచరించనున్నారు. అంతేకాదు రేపు మంగళవారం కావడంతో మంగళ గౌరీ వ్రతం కూడా ఆచరించనున్నారు. అధిక శ్రావణ మాసంలో జరుపుకోనున్న కాలాష్టమి వ్రతం మరింత ప్రత్యేకంగా.  కాలభైరవుడిని శివుని అవతారంగా పరిగణిస్తారు. అంతేకాదు కాశీ కొత్వాల్ అని కూడా పిలుస్తారు. కాల భైరవుడిని ఏ పద్ధతిలో పూజించడం, ఉపవాసం చేయడం ద్వారా సంతోషిస్తాడో ఈ రోజు తెలుసుకుందాం..

కాలాష్టమి పూజ శుభ సమయం

కాలాష్టమి రోజున కాల భైరవుడిని పూజించడం ద్వారా జీవితంలోని అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కాల భైరవుడు వెంటనే ప్రతి అడ్డంకిని తొలగించి తన భక్తులపై అనుగ్రహాన్నికురిపిస్తాడు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4.14 గంటలకు కాలాష్టమి తిథి ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.52 గంటలకు ముగుస్తుంది. ఈ ముహూర్తం కాలభైరవుని ఆరాధనకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మీరు అప్పుల బాధతో ఉంటే, కాలాష్టమి నాడు శివలింగానికి 21 బిల్వ పత్రాలను  సమర్పించండి. శివుడికి పాలు, పెరుగుతో అభిషేకం చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కాలాష్టమి రోజున నల్ల కుక్కకు తీపి గారెలు కాలభైరవుని అనుగ్రహం కలుగుతుందని మత విశ్వాసం.

కాలాష్టమిని ఎలా పూజించాలంటే..

కాలాష్టమి నాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి ముందుగా స్నానమాచరించి, పూజాగదిని శుద్ధి చేసి అక్కడ పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠంపై శుభ్రమైన గుడ్డ వేసి, అక్కడ కాలభైరవుని విగ్రహాన్ని ప్రతిష్టించండి. ఈ సమయంలో కాలభైరవుడితో పాటు గణపతి, మహాదేవుని విగ్రహాలను కూడా ప్రతిష్టించాలి. ధూపం, దీపం, తమలపాకులు, పువ్వులు, స్వీట్లు మొదలైన వాటిని సమర్పించి కాలభైరవుడిని పూజించండి. కాలభైరవుని ముందు దేశీ నెయ్యికి బదులుగా ఆవనూనెతో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వలన కాలభైరవుడు  త్వరగా సంతోషపడతాడని విశ్వాసం. ఆలయంలో కాల భైరవుడికి ఆవాల నూనె , మినుములతో చేసిన పదార్ధాలను నైవేధ్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పూజ అనంతరం  కాలభైరవుని వాహనం అయిన నల్ల కుక్కకు ఆహారం అందిచడం అత్యంత శుభప్రదం.

ఇవి కూడా చదవండి

కాలాష్టమి వ్రతం ప్రాముఖ్యత ఏమిటంటే

19 ఏళ్ల తర్వాత అధిక శ్రావణ మాసం వచ్చింది. ఈ పవిత్ర మాసంలో కాలాష్టమి వ్రతం పాటించడం వల్ల దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. శివుని అవతారమైన కాల భైరవుడిని పూర్తి ఆచార వ్యవహారాలతో, నిర్మలమైన  హృదయంతో పూజించే ఏ భక్తుడి కోరికైనా నెరవేరుతుందని కాలభైరవుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు.

గ్రహ దోషాలు ఎలా పోగొట్టుకోవాలంటే..

శివుని అవతారమైన కాల భైరవుడిని పూజించడం ద్వారా గ్రహ దోషాలు కూడా దూరమవుతాయని, రాహు-కేతువుల దుష్ప్రభావాల నుండి విముక్తి పొందవచ్చని విశ్వాసం. కాలాష్టమి రోజున, దేవుని ముందు నాలుగు ముఖాల ఆవనూనె దీపాన్ని వెలిగించి, జిలేబీని సమర్పించి కాల భైరవ చాలీసాను పఠించాలి. ఈ పద్ధతితో పూజించడం ద్వారా, కాల భైరవుడు గ్రహ దోషాలను తొలగిస్తాడు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)