Naresh Donation For Ram Mandir : గత కొన్ని దశాబ్దాల హిందువుల కల అయోధ్యలో రామమందిర నిర్మాణం. ఈ కల నెరవేరే రోజు వస్తున్న వేళ ఆలయ నిర్మాణానికి దేశంలోని కోట్లాది హిందువు తమ వంతు సాయం అందిస్తున్నారు. మందిర నిర్మాణానికి అవసరమయ్యే విరాళాలను రామ జన్మభూమి తీర్ధ ట్రస్ట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ట్రస్ట్ కు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు నుంచి సామాన్యులవరకూ తమ వంతు విరాళం అందిస్తున్నారు.
ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి అక్షయ్ కుమార్, పవన్ కళ్యాణ్, ప్రణీత లు రామ మందిర నిర్మాణానికి భూరివిరాళం అందించగా.. తాజాగా సీనియర్ నటుడు నరేష్ తన వంతు సాయంగా రూ. 5 లక్షల విరాళాన్ని అందించాడు.
ఈ విషయాన్ని నరేష్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అయోధ్యలో రామమందిర నిర్మాణం 90 కోట్ల మంది హిందువుల కల త్వరలో నిజమవుతుందని..తన వంతుగా చిన్న సాయం చేశాన్నాడు. అంతేకాదు.. ఈ బృహత్కర కార్యం కోసం మీరు కూడా మీ వంతు సాయం చేయండి అని నరేష్ పిలుపునిచ్చాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆరిస్టుగా నటిస్తున్న నరేష్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Also Read: