మన చేతిలోని రేఖలు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని దాదాపుగా అన్ని మతాలవారు నమ్ముతారు. హస్తసాముద్రిక జ్యోతిషశాస్త్రాన్ని అనుసరించి ఆ నమ్మకాల ప్రకారం చేతిలోని ప్రతి రేఖకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అరచేతిలో కనిపించే వివిధ రకాల గుర్తులు, గీతలు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. చేప గుర్తును మీరు గమనించే ఉంటారు. హస్తసాముద్రికంలో ఈ చేపల గుర్తు చాలా పవిత్రమైనదిగా, ప్రముఖమైనదిగా ప్రసిద్ధి. ఇక అరచేతిలో చేపగుర్తుతో మనకు కలిగే శుభ ఫలితాలేమిటో ఇప్పడు మనం తెలుసుకుందాం..
హస్తసాముద్రికం ప్రకారం బొటనవేలు క్రింద భాగం వీనస్ పర్వతానికి వెళుతుంది. అరచేతిపై వీనస్ పర్వతం ఉన్నవారు చేపల గుర్తును కలిగి ఉంటే.. అటువంటి వ్యక్తి చాలా అందమైన శరీరాకృతి కలిగి ఉంటారు. వారి జీవితం చాలా సుఖప్రదంగా వెలిగిపోతుంది. ఇంకా ఇలాంటి వ్యక్తులు చాలా రొమాంటిక్‌గా ఉండడమే కాక మంచి జనాదరణ పొందినవారిగా ఉంటారు.
అరచేతిలో వీనస్ పర్వతానికి బదులుగా చేప గుర్తును కలిగి ఉన్న వ్యక్తి తన జీవితంలో చాలా డబ్బును సంపాదిస్తాడు. అలాంటి వ్యక్తులు కళాకారులుగా గుర్తింపు పొందుతారు. వారి కళ, నైపుణ్యం ప్రతిచోటా చర్చనీయాంశమవుతుంది
అరచేతిలో మధ్యవేలు కింది భాగాన్ని శని పర్వతం అంటారు. శని గ్రహంపై చేప ఆకారంలో గుర్తు కలిగిన వ్యక్తి చాలా రహస్య స్వభావం కలిగి ఉంటాడు. అలాంటి వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు క్రమశిక్షణతో మంచి పేరు, డబ్బును సంపాదిస్తారు. అలాంటి వారిపై శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు కూడా ఉంటాయి.
చూపుడు వేలు కింది భాగాన్ని గురు పర్వతం అంటారు. అరచేతులలో గుర్తు ఉన్న వ్యక్తులు చాలా తెలివైనవారు. విచక్ష, తెలివితేటలతో మంచి పేరు, సంపదను పొందుతారు. ఇంకా ఈ గుర్తును కలిగినవారు జీవితంలో అన్ని రకాల సుఖాలు, సౌకర్యాలు పొందుతాడు.
అరచేతిలో ప్రాణరేఖ దగ్గర చేప గుర్తు ఉన్నవారు ఎల్లప్పుడూ శుభ ఫలితాలను పొందుతారు. అలాంటి వ్యక్తులు జీవితాంతం సంతోషంగా ఉండడమే కాక చాలా డబ్బు సంపాదిస్తారు. అరచేతిలో లైఫ్ లైన్ పైన ఉన్న చేప గుర్తు చాలా శుభప్రదంగా ప్రసిద్ధి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..