Chanakya niti: పొరపాటున కూడా ఈ 5 విషయాలు ఎవ్వరికీ చెప్పకండి.. మీ ఆనందం ఆవిరై పోతుంది..

|

Dec 31, 2022 | 8:27 AM

మనుషులు సమాజంలో ఎలా బతకాలి, ఎలాంటి వ్యక్తులకు దూరంగా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను చాణక్యుడు వివరించారు. చాణక్యుడు జీవితానికి సంబంధించి తెలిపిన వివరాలను పాటిస్తే జీవితంలో బాధలు దూరమై సంతోషంగా ఉంటారని చెబుతుంటారు. నిజానికి చాణక్య నీతిలో వివరించిన ఒక్కో అంశం ఒక్కో జీవిత పాఠాన్ని..

Chanakya niti: పొరపాటున కూడా ఈ 5 విషయాలు ఎవ్వరికీ చెప్పకండి.. మీ ఆనందం ఆవిరై పోతుంది..
Chanakya Niti
Follow us on

మనుషులు సమాజంలో ఎలా బతకాలి, ఎలాంటి వ్యక్తులకు దూరంగా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను చాణక్యుడు వివరించారు. చాణక్యుడు జీవితానికి సంబంధించి తెలిపిన వివరాలను పాటిస్తే జీవితంలో బాధలు దూరమై సంతోషంగా ఉంటారని చెబుతుంటారు. చాణక్య నీతిలో వివరించిన ఒక్కో అంశం ఒక్కో జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. చాణక్యుడు ప్రతీ విషయాన్ని ఎంతో లోతుగా ఆలోచించి మరీ ప్రస్తావించారు. ప్రస్తుతం మోటివేషనల్‌ స్పీకర్స్‌ చెబుతున్న విషయాలను చాణక్య ఎప్పుడో విరించారు. ఇక జీవితంలో సంతోషం దూరం కాకూడదనుకుంటే కొన్ని విషయాలను ఎప్పటికీ ఎవరితో పంచుకోకూడదని చాణక్య వివరించారు. ఇంతకీ ఇతరులతో పంచుకోకూడదని ఆ విషయాలు ఏంటి.? వాటివల్ల కలిగే నష్టాలు ఏంటి.? లాంటి వివరాలు మీకోసం..

* మీరు ఎంత సంపాదిస్తున్నారన్న విషయాన్ని ఎవ్వరితో పంచుకోకూడదు. ఒకవేళ మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఆ విషయాన్ని కేవలం కుటుంబానికి మాత్రమే పరిమితం చేయాలి. అంతేకాకుండా మతపరమైన ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎవ్వరితో పంచుకోకూడదు. ఇలా చేయడం వల్ల వారికి పుణ్యం లభించదు.

* మీ బలహీనతలు, లోపాల ఎప్పుడూ ఎవరితో పంచుకోకూడదు. మీ వీక్‌ పాయింట్స్‌ చెప్పుకోవడం వల్ల పరువు నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. అలాగే ప్రజలు మిమ్మల్ని తక్కువ అంచనా వేసే అవకాశాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

* మీరు చేసే దానం గురించి ఎవరికీ చెప్పకూడదు. రహస్య దానమే గొప్ప దానంగా పరిగణిస్తారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే దానమే మంచి ఫలితాలనిస్తుంది. కాబట్టి మీరు చేసే దానం గురించి నలుగురితో ఎప్పటికీ పంచుకోకూడదు.

* మీరు భగవంతుడిని పూజించే మంత్రాన్ని ఇతరులతో పంచుకోకూడదు. ముఖ్యంగా వేద పండితులు, బ్రాహ్మణులు మీకు ప్రబోధించిన మంత్రాన్ని మీరు ఆచరిస్తున్నట్లయితే దానిని ఎవరికీ చెప్పకండి. దీనివల్ల మంత్రం ప్రభావం తగ్గే అవకాశాలు ఉంటాయి.

* వైవాహిక జీవితానికి సంబంధించిన వివరాలను మీ మధ్య పరిమితం చేసుకోండి. ఇంట్లో మీ భాగస్వామితో జరిగే విషయాలను ఎవరికీ చెప్పకండి. దాంప్యత జీవితాన్ని ఎంత గోప్యంగా దాచుకుంటే అంత మంచిది. మీ పాట్నర్‌తో శారీరక సంబంధానికి సంబంధించిన వివరాలను పక్కవారితో పంచుకుంటే గౌరవం కోల్పోతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..