వేలాది జనం.. మధ్యలో ముళ్లకంపలే పూలపాన్పు.. అంబ పలుకు జగదంబ పలుకు..!

మీరు జాతరలు చూసుంటారు. ఊర మాస్‌ జాతరల గురించి విని ఉంటారు. కానీ తమిళనాడులో.. ఓ వింత ఆచారం నెక్ట్స్‌ లెవెల్‌. అక్కడ భక్తి పీక్స్‌కు చేరుతుంది. ముళ్లకంపలే పూలపాన్పులవుతాయి. మనం కనీసం కాలు పెట్టడానికి కూడా సాహసించలేని ముళ్ల కంప మీద, ఓ వృద్ధురాలు తాండవం చేస్తుంది. ఆ తర్వాత జరిగే సీన్లు హర్రర్‌ సినిమాను తలపిస్తాయి.

వేలాది జనం.. మధ్యలో ముళ్లకంపలే పూలపాన్పు.. అంబ పలుకు జగదంబ పలుకు..!
Poongavanam Muthumariamman Temple Fest, Sivaganga District

Edited By:

Updated on: Jan 03, 2026 | 10:24 AM

మీరు జాతరలు చూసుంటారు. ఊర మాస్‌ జాతరల గురించి విని ఉంటారు. కానీ తమిళనాడులో.. ఓ వింత ఆచారం నెక్ట్స్‌ లెవెల్‌. అక్కడ భక్తి పీక్స్‌కు చేరుతుంది. ముళ్లకంపలే పూలపాన్పులవుతాయి. మనం కనీసం కాలు పెట్టడానికి కూడా సాహసించలేని ముళ్ల కంప మీద, ఓ వృద్ధురాలు తాండవం చేస్తుంది. ఆ తర్వాత జరిగే సీన్లు హర్రర్‌ సినిమాను తలపిస్తాయి.

ఏడడుగుల ఎత్తు ముళ్ల కంప చుట్టూ జనం తాండవం.. ముళ్లకంప మీద ఓ వృద్ధురాలు శివతాండవం.. ఊగి ఊగి ఒక్కసారిగా ముళ్లకంపపై ఆమె పడిపోతుంది. ఆ తర్వాత ఆ వృద్ధురాలు చెప్పే మాటలను జనం చెవులు రిక్కించుకుని వింటారు. ఇది అమ్మవారి ఆలయంలో వింత ఆచారం. ఏడు అడుగుల ముళ్ల పడకపై నుంచి ఓ వృద్ధురాలు వినిపించే దైవ వాక్కు కోసం వేలాదిమంది తరలివస్తారు. దైవ వాక్కుకోసం కిలోమీటర్ల దూరం భక్తులు పడిగాపులు కాస్తారు. ఏడు అడుగుల ఎత్తైన ముళ్ల పడకపై పడుకుని 63 ఏళ్ల వృద్ధ మహిళ చెప్పే దైవవాక్యం ఫలిస్తుందని భక్తుల నమ్మకం.

తమిళనాడులోని శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపంలోని గ్రామంలో పూంగావనం ముత్తుమారియమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి 63 ఏళ్ల నాగరాణి అమ్మవారు నిర్వాహకురాలిగా ఉన్నారు. ప్రతి మండల పూజ సమయంలో 48 రోజులు ఉపవాసం పాటిస్తూ ప్రజలకు దైవ వాక్కు చెప్పడం ఆమె ఆనవాయితీ.

ఈ క్రమంలో ఏడు అడుగుల ఎత్తులో ఉడై ముళ్లు, కరువేలు చెట్టు ముళ్లు వంటి వాటితో ముళ్ల పడకను సిద్ధం చేశారు. నాగరాణి అమ్మవారు ఆ ముళ్ల పడకపై ఎక్కి కూర్చుని, నిలబడి, నాట్యం చేస్తూ భక్తులకు ఆశీర్వాదాలు ఇవ్వడం ఆమెకు అలవాటు. ఈ సంవత్సరం 49వ మండల పూజా ఉత్సవంలో భాగంగా అమ్మవారికి శంఖాభిషేకం జరిగింది. అనంతరం అమ్మవారికి దీపారాధన నిర్వహించారు.దీనిని కొనసాగిస్తూ, మధ్యాహ్నం నాగరాణి ముళ్ల పడకపై కూర్చుని ఆశీర్వాదాలు అందించేందుకు ఆలయం ముందు ఉన్న మైదానంలో ఉడై ముళ్లు, ఇలంతై ముళ్లు, కత్తాళి ముళ్లు వంటి వివిధ రకాల ముళ్లతో 7 అడుగుల ఎత్తులో ముళ్ల పడకను ఏర్పాటు చేశారు.

ఇక ఆలయానికి వచ్చిన భక్తులు మేళతాళాలతో వేడుకని ప్రారంభించారు. దీనిని అనుసరించి నాగరాణి ముళ్ల పడకపై కూర్చుని, నిలబడి, పడుకుని, నాట్యం చేస్తూ ఆగ్రహంగా భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తూ వారికి దైవ వాక్కు చెప్పారు. అంబ పలికింది.. జగదంబ కరుణించిందని భక్తులు సంబరపడ్డారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు భారీగా పాల్గొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..