
దేశవ్యాప్తంగా అనేక ప్రసిద్ధ హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి. జీవితంలో మీరు ఎదుర్కొనే సమస్యకు తగ్గట్టుగా ఆయా దేవాలయాలను సందర్శించడం వల్ల ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. వాటి చారిత్రక ప్రాముఖ్యత, వాటికి సంబంధించిన కథల ఆధారంగా ఎంచుకున్న 8 దేవాలయాల వివరాలు కింద ఉన్నాయి.
జీవితంలోని అడ్డంకులు, ఇబ్బందులు తొలగించడానికి.
ప్రత్యేకత: సంకట్ మోచన్ అంటే “కష్టాలను తొలగించేవాడు” అని అర్థం. ఇక్కడ స్వామిని దర్శించడం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
ఏమి సమర్పించాలి: బేసన్ లడ్డూలు సమర్పించండి. సాయంత్రం హారతిలో పాల్గొనండి.
బలం, ధైర్యం, కొత్త ప్రారంభాల కోసం.
ప్రత్యేకత: సిమ్లాలో ఎత్తైన కొండపై ఉన్న ఈ దేవాలయం దేశంలో ఎత్తైన హనుమాన్ విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం అంతర్గత బలం కోరుకునే భక్తులకు శక్తివంతమైన వాతావరణం ఇస్తుంది. ముఖ్యమైన పరీక్షలకు ముందు విద్యార్థులు, కొత్త కెరీర్ ప్రారంభించేవారు ఇక్కడ సందర్శిస్తారు.
ఏమి సమర్పించాలి: పువ్వులు సమర్పించండి, ప్రార్థనలు చేయండి, నెయ్యి దీపం వెలిగించండి. సుందరకాండ పఠనం మంచిది.
కుటుంబ సంతోషం, సంక్షేమం కోసం.
ప్రత్యేకత: ఈ దేవాలయం కుటుంబ సంతోషం, రక్షణ ఇస్తుందని నమ్ముతారు. సంతానం కోసం, కుటుంబ సంక్షేమం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు.
ఏమి సమర్పించాలి: స్వీట్లు, నూనె దీపాలు సమర్పించండి. మంగళవారం, శనివారం ఇక్కడ సందర్శించడానికి శుభకరమైన రోజులు.
ప్రతికూల శక్తులు, మానసిక భారం నుంచి ఉపశమనం కోసం.
ప్రత్యేకత: హనుమంతుడిని బాల రూపంలో పూజిస్తారు. దీర్ఘకాలిక భయం, ఆందోళన, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం భక్తులు ఇక్కడికి వస్తారు. అదృష్టం లేనివారు, నిద్రలేమి, కారణం తెలియని భయం ఉన్నవారు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.
చెడు వ్యసనాల నుంచి కోలుకోవడానికి.
ప్రత్యేకత: తీవ్రమైన వ్యసనాలతో బాధపడేవారికి ఈ నమక్కల్ ఆంజనేయార్ దేవాలయం సందర్శించాలని సూచిస్తారు. హనుమంతుడు ఉగ్రంగా, ధ్యాన భంగిమలో ఇక్కడ ఉంటారు. ఇక్కడ క్రమం తప్పకుండా జపం (chanting) చేయడం మరింత శక్తివంతమైనదిగా భావిస్తారు.
దేని కోసం: పని ప్రదేశంలో సమస్యలు, ఉద్యోగ భద్రత కోసం.
ప్రత్యేకత: కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం ఉద్యోగ సమస్యలను తొలగిస్తుందని ప్రతీతి. పని ప్రదేశంలో అడ్డంకులు, ఉద్యోగ భద్రత కోసం భక్తులు ఇక్కడికి వస్తారు.
ఏమి సమర్పించాలి: పువ్వులు సమర్పించండి, నూనె దీపాలు వెలిగించండి. మంగళవారం, శనివారం శుభకరమైన రోజులు.
కోరికలు తీర్చడానికి, మొక్కులు చెల్లించడానికి.
ప్రత్యేకత: ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ హనుమాన్ దేవాలయాలలో ఇది ఒకటి. భక్తులు ఇక్కడికి రహస్య కోరికలు కోరడానికి, కోరిక నెరవేరిన తర్వాత మొక్కులు చెల్లించడానికి వస్తారు.
ఏమి సమర్పించాలి: కొబ్బరికాయ, ఎరుపు దారాలు (మౌళి) కట్టి మొక్కుకుంటారు. కోరిక తీరిన తర్వాత మళ్లీ వచ్చి మొక్కులు చెల్లిస్తారు.
మొత్తం కుటుంబ రక్షణ, కుటుంబ సమస్యల కోసం.
ప్రత్యేకత: కుటుంబ సంక్షోభాలను ఎదుర్కొంటున్న వారు, రక్షణ కోరుకునే వారు ఇక్కడికి వస్తారు. హనుమంతుడు రాముడి జన్మస్థలానికి రక్షకుడుగా ప్రసిద్ధి.
ఏమి సమర్పించాలి: ఎరుపు సింధూరం, నూనె దీపాలు సమర్పించండి. ఇక్కడ హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. హనుమాన్ జయంతి, రామ నవమి లాంటి పండుగలు ఘనంగా జరుగుతాయి.