హరిహరులు ఒకేచోట కొలువైన క్షేత్రం.. శతాబ్ధాల చరిత గల ఆధ్యాత్మిక ఝరి.. ప్రత్యేకమేంటంటే..!

శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని మధ్య అహోబిలం అనీ, శైవులు దీనిని మధ్య కైలాసం అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.

హరిహరులు ఒకేచోట కొలువైన క్షేత్రం.. శతాబ్ధాల చరిత గల ఆధ్యాత్మిక ఝరి.. ప్రత్యేకమేంటంటే..!
Pushpagiri Kshetram In Kadapa District

Edited By:

Updated on: Dec 21, 2025 | 3:27 PM

శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని మధ్య అహోబిలం అనీ, శైవులు దీనిని మధ్య కైలాసం అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.

కడప నగరానికి 16కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పగిరి పుణ్యక్షేత్రం ఎన్నో విశేషాలకు నిలయం. ఇక్కడ ఐదు నదులు కలిసే ప్రాంతం, శివకేశవులు ఒకేచోట కొలువైన ప్రాంతం. అంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏకైక శంకరాచార్య మఠం,
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. మరెన్నో విశేషాలు ఉన్నాయి. అదే పుష్పగిరి మహా క్షేత్రం ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడే ఉంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. ఈ గ్రామాన్ని గురించి తెలుగులో తొలి యాత్రాచరిత్రగా చెప్పబడే కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి.

పురాణ గాథల ప్రకారం ఈ ప్రాంతంలో కాంపల్లె అనే గ్రామం ఉండేది. గరుత్మంతుడు ఇంద్రుని అమృతభాండాన్ని తీసుకుని వస్తుండగా ఇంద్రుడు అడ్డగించాడు. ఇరువురికీ గరుత్మంతునికి పోరాటం జరిగిందని, ఆ సమయంలో అమృతభాండం నుంచి కొన్ని చుక్కలు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయని నానుడి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగే వారికి యవ్వనం లభిస్తుందని నమ్మకం. అమరత్వమూ సిద్ధించేదని ప్రసిద్ది.. దీంతో దేవతలు భయపడి శివుడిని ఆశ్రయించడంతో.. శివుడు వాయు దేవుడిని ఆజ్ఞాపించగా వాయువు కైలాస పర్వతం నుంచి ఒక ముక్కను తెచ్చి ఆ కోనేటిలో వేశాడట. అది కోనేటిలో పుష్పం వలె తేలిందని, అదే పుష్పగిరి అయిందని అంటారు.

పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్న నదిలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రం అని కూడా పిలుస్తారు. కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. పుష్పగిరిలోనే పాపవినేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. పుష్పగిరిలో కింద వైద్యనాదేశ్వర, త్రికుటేశ్వర, భీమలింగేశ్వర, కామాక్షి అమ్మవారి ఆలయాలున్నాయి. వైద్య నాథేశ్వరుడు, భీమేశ్వరుడు, త్రికూటేశ్వరుడు ఇక్కడ కొలవై ఉన్నారు. వైద్య నాథేశ్వరాలయంలో శ్రీకామాక్షి మందిరం ఉంది.

వరదలు వచ్చినప్పుడు పెన్న నది దాటి ఆవలి వైపునకు వెళ్ళలేరు. అప్పుడు ఇవతల వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి. పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. పుష్పగిరి శిల్పకళా సంపదకు పెట పేరు. ఆలయం బయటి గోడలపైన ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరసలు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు ఉన్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…