YCP vs TDP: ఢిల్లీకి ఏపీ లొల్లి.. నెక్ట్స్ ఏం జరగబోతోంది..

|

Oct 22, 2021 | 10:23 AM

బాబు దీక్ష కంటిన్యూ అవుతోంది.. వైసీపీ శ్రేణుల బాబు వ్యతిరేక నిరసనలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. మొన్న నిన్న జరిగినదానికి ఇవాళ కొనసాగింపు మాత్రమే.

YCP vs TDP: ఢిల్లీకి ఏపీ లొల్లి.. నెక్ట్స్ ఏం జరగబోతోంది..
Ysrcp Vs Tdp
Follow us on

బాబు దీక్ష కంటిన్యూ అవుతోంది.. వైసీపీ శ్రేణుల బాబు వ్యతిరేక నిరసనలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. మొన్న నిన్న జరిగినదానికి ఇవాళ కొనసాగింపు మాత్రమే. కానీ.. ఈ మూడు రోజులకు కొనసాగింపుగా రేపు జరగబోతోంది అంతకుమించి అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. లోకల్‌ లీడర్ల బూతుపంచాయతీ.. ఢిల్లీకి చేరబోతున్నట్లే కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీ ఆఫీస్‌ మీద దాడులేంటీ అంటూ చంద్రబాబు అమిత్‌ షాకు ఫిర్యాదు చెయ్యబోతున్నారు. పనిలో పనిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్లూ కోరబోతున్నారు.

చంద్రబాబు వైసీపీకి వ్యతిరేకంగా దీక్ష చేస్తేనే దానికి ప్రతిస్పందనగా ప్రజాగ్రహ నిరసనలు చేస్తున్న వైసీపీ.. బాబు ఢిల్లీ వెళ్తే చూస్తూ ఉంటుందా. ఉండబోమని ముందే చెప్పేసింది. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి పాలన కావాలంటూ కహానీలు వినిపిస్తే.. మేం నేరుగా సీఈసీ దగ్గరకు వెళ్లి టీడీపీని రద్దు చెయ్యాలని కోరతాం అంటున్నారు సజ్జల. సో.. ఈ రాత్రి 8గంటలకు చంద్రబాబు దీక్ష, వైసీపీ నిరసనలు ముగిస్తే రేపు ఉదయం ఢిల్లీ ఫ్లైట్‌లో వెళ్లేది ఎవరెవరు అన్నది తేలుతుంది. ఇంతకీ ఇక్కడ మాటలేనా.. ఢిల్లీలోనూ అపాయింట్‌మెంట్‌ల కోసం రెండు పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

Also Read: హుజురాబాద్‌లో పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..పార్టీలకు షాక్

పైనుంచి చూస్తే పత్తి చేనే అనుకుంటారు.. లోపలకు దిగి చెక్ చేసిన అధికారులు షాక్