OBC Bill: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుపై వైయ‌స్ఆర్సీపీ ఎంపీల వైఖరి ఇదీ..

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఇవాళ ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు వైయ‌స్ఆర్ సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఓబీసీ బిల్లుకు వైయ‌స్ఆర్ సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని వైయ‌స్ఆర్ సీపీ

OBC Bill: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుపై వైయ‌స్ఆర్సీపీ ఎంపీల వైఖరి ఇదీ..
Ysrcp Mps

Updated on: Aug 10, 2021 | 9:38 PM

YSRCP MPs: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఇవాళ ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు వైయ‌స్ఆర్ సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఓబీసీ బిల్లుకు వైయ‌స్ఆర్ సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు తెలిపారు. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం శుభపరిణామమని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఏయే కులాలు వెనకబాటు తనంలో ఉన్నాయో.. రాష్ట్ర ప్రభుత్వాలకే అవగాహన ఉంటుందన్నారాయన.

ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఓబీసీల రిజర్వేషన్లను పలుమార్లు కేంద్రం దృష్టికి తెచ్చారని రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ఓబీసీ బిల్లును స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్రం కేటాయిస్తున్న బడ్జెట్‌ నామమాత్రం బడ్జెట్‌ అని రమణ విమర్శించారు.

67 ఏళ్ల నుంచి ఓబీసీ కేటగిరీ కింద వెనకబడి ఉన్న కులాలకు ఇన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వైయ‌స్ఆర్ సీపీ లోక్‌సభ ఎంపీ మార్గాని భరత్‌ చెప్పారు. వారికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ బిల్లును తీసుకురావడం మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వ్యాఖ్యానించారు.

Read also: “మా తెలుగు తల్లికి మల్లెపూదండ”కి అందిన పారితోషికం, ఈ పాట ఎప్పుడు.. ఎందుకు.. ఎవరు రాశారో, ఎలా పుట్టిందో తెలుసా.?