YSRCP MP : ‘తండ్రీకొడుకులిద్దరూ పక్క రాష్ట్రంలో ఉండటం వల్లే ఏపీలో ఈసారి ముందే వర్షాలు’.. విజయసాయి ఎద్దేవా పరంపర

|

Jun 05, 2021 | 9:30 PM

తన కొడుకు మూర్ఖుడు కాదని నిరూపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అతని పసుపు శిష్యులు కూడా తమ యజమాని ఏమి చెబుతున్నారో అది నమ్ముతున్నట్లుగా వ్యవహరించడానికి వాళ్లూ..

YSRCP MP :  తండ్రీకొడుకులిద్దరూ పక్క రాష్ట్రంలో ఉండటం వల్లే ఏపీలో ఈసారి ముందే వర్షాలు..  విజయసాయి ఎద్దేవా పరంపర
Vijayasai reddy
Follow us on

Vijayasai reddy : వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్ట‌ర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌, తెలుగుదేశం పార్టీపై సెటైర్ల పరంపర కొనసాగించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన కొడుకు మూర్ఖుడు కాదని నిరూపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అతని పసుపు శిష్యులు కూడా తమ యజమాని ఏమి చెబుతున్నారో అది నమ్ముతున్నట్లుగా వ్యవహరించడానికి వాళ్లూ తమ వంతు ప్రయత్నం వాళ్లు చేస్తున్నారు. మొత్తానికి తెలుగు డ్రామా పార్టీలో నాటకం కొనసాగుతోందంటూ విజయసాయి ఇవాళ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ఇక మరో ట్వీట్ లో ఏపీలో వర్షాల గురించి ట్వీట్ చేస్తూ పనిలో పనిగా చంద్రబాబు, లోకేష్ లను వాడేశారు విజయసాయి.

“తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు వచ్చాయని అంతా అనుకుంటున్నారు. కరువుకు మారు పేరుగా మారిన నారా వారు ఇంకో 4 నెలలు అడుగు పెట్టకుండా ఉంటే రుతుపవనాలు వర్షాలను కుమ్మరిస్తాయి. గడచిన రెండేళ్లలాగే ఈ ఏడూ జూన్ లోనే వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి.” అంటూ సెటైర్లు వేశారు.

“ఒక్క ఇటుక కూడా పెట్టకుండానే అమరావతి గ్రాఫిక్స్ కోసం 5 ఏళ్లు గడిపేశాడు చంద్రబాబు. తాడిపత్రిలో 500 ఆక్సిజన్ బెడ్ల జర్మన్ హ్యాంగర్ హాస్పిటల్ ను 15 రోజుల్లో పూర్తి చేయించారు సిఎం జగన్ గారు. ప్రజల కోసం తపించే నాయకుడికి, పబ్లిసిటీతో బతికే పరాన్నజీవికి తేడా ఇదే.” ఇడ్లీ పాత్ర గ్రాఫిక్స్ అంటూ మరో ట్వీట్లో చెలరేగిపోయారు వైసీపీ ఎంపీ.

Read also : Vanitha : ‘తెలుగు మహిళ పేరిట పనీపాట లేని పది మంది పోగై, జూమ్ మీటింగ్ పెట్టుకుని..’ : మంత్రి తానేటి వ‌నిత మండిపాటు