
వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్. జగన్ ఒక్క కనుసైగ చేస్తే చాలు ఒక్కరు కూడా మిగలరు అంటూ అనిల్ కుమార్ తాజాగా కామెంట్లు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక సభలో పాల్గొన్న అనిల్.. 2019 ఎన్నికల్లో ఎగరాల్సింది వైసీపీ జెండానేనని అన్నారు. జగన్ అన్న కోసం ప్రాణం ఇచ్చే సైనికులు ఉన్నామంటూ ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. ఇప్పుడు మనముందు ఉన్నది ఒక్కటేనని మాట్లాడిన అనిల్.. చంపడమా..? చావడమా..? అంటూ ఉద్వేగంగా అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.