వైసీపీలో విషాదం.. కాకినాడ నగర అధ్యక్షుడు కన్నుమూత

తూర్పుగోదావరి జిల్లా వైసీలో విషాదం నెలకొంది. కాకినాడ నగర వైసీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ కన్నుమూశారు. కరోనా సోకడంతో

వైసీపీలో విషాదం.. కాకినాడ నగర అధ్యక్షుడు కన్నుమూత

Edited By:

Updated on: Nov 08, 2020 | 9:34 AM

Frooti Kumar YSRCP: తూర్పుగోదావరి జిల్లా వైసీలో విషాదం నెలకొంది. కాకినాడ నగర వైసీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ కన్నుమూశారు. కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఫ్రూటీ కుమార్ అందులోనే ఉన్నారు. పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. మరోవైపు ఆయన మరణంపై పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఫ్రూటీ కుమార్ ఆత్మకు శాంతి కలగాలని పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే ఇటీవల ఫ్రూటీ కుమార్  ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతిమణి చంద్రకళా దీప్తికి ఫోన్‌ చేసి ఆరా తీశారు.

Read More:

లాక్‌డౌన్‌లో 15 స్క్రిప్ట్‌లను రిజెక్ట్ చేసిన రామ్‌..!

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,440 కొత్త కేసులు.. 5 మరణాలు