YSRCP: బద్నాం చేయడమే పని.. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య అదే.. విమర్శలు గుప్పించిన సజ్జల

|

Oct 27, 2021 | 9:55 PM

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీని డ్రగ్స్ రాజధానిగా క్రియేట్‌ చేస్తున్న చంద్రబాబు ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదన్నారు సజ్జల. చంద్రబాబు వారం రోజుల క్రితం మొదలు పెట్టిన బూతు డ్రామాకు నిన్న తెర దించారని సజ్జల కామెంట్ చేశారు. ఏపీలో సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబుకు డ్రామా క్రెయేట్ […]

YSRCP: బద్నాం చేయడమే పని.. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య అదే.. విమర్శలు గుప్పించిన సజ్జల
Sajjala Ramakrishna Reddy
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీని డ్రగ్స్ రాజధానిగా క్రియేట్‌ చేస్తున్న చంద్రబాబు ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదన్నారు సజ్జల. చంద్రబాబు వారం రోజుల క్రితం మొదలు పెట్టిన బూతు డ్రామాకు నిన్న తెర దించారని సజ్జల కామెంట్ చేశారు. ఏపీలో సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబుకు డ్రామా క్రెయేట్ చేయడం తెలుసు.. బోర్లా పడటం కూడా తెలుసని అన్నారు. అబద్దాలు, డ్రామాలు, విధానాలను అలవోకగా మార్చడం చంద్రబాబు తెలిసిన ఏకైక విద్య అని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే రాజకీయాలకు ప్రజలు, ప్రజా జీవితాలు, ప్రజల సమస్యలతో సంబంధమే ఉండదన్నారు.

తిమ్మిని బమ్మి చేయడంలో చంద్రబాబు సమర్థుడు. రాష్ట్రపతి పాలన లేదంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రపతి పాలనపై రాష్ట్రపతి ఏమన్నారో ఏమో కానీ.. టీడీపీ నేతలు చెప్పాల్సింది చెప్పారు. కక్కాల్సింది కక్కారని మండిపడ్డారు సజ్జల.

ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ గురించి ప్రస్తావనే లేదని.. అసలు అమిత్‌ షాకు చంద్రబాబు ఏం ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు సజ్జల. చంద్రబాబు ఫిర్యాదు చేసినా అమిత్ షా రాష్ట్రంపై ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు. ఢిల్లీ పర్యటనతో చంద్రబాబు మీడియాను ఆకర్షించగలిగారు.. కానీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ డ్రగ్స్‌కు రాజధానిగా ఉందని చంద్రబాబు చెప్పడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమేనని అన్నారు. ఈ ఒక్క విషయంలోనే చంద్రబాబుపై కేసు పెట్టి శిక్ష విధించాల్సి ఉంటుందన్నారు. ఏపీ ఇమేజ్ డామేజ్ చేస్తున్న చంద్రబాబే ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని.. ఈ ఉగ్రవాదాన్ని ఏమనాలో కూడా తమకు అర్థం కావడం లేదని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.

రాష్ట్రం అంటే మందు, డ్రగ్స్ అని డ్రగ్స్ రాజదాని అని ప్రతిపక్ష నేతగా ఎలా చెప్తారు. బూతులు తిట్టిన వ్యక్తి మాల్దీవులకు పోయాడు. తిట్టించిన వ్యక్తి హైదరాబాద్‌లో కూర్చున్నాడని సజ్జల అన్నారు. అబద్ధాన్ని ప్రాజెక్ట్ చేయడంలో చంద్రబాబు శక్తి అపారం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడతారని ప్రచారం ఇంకా ఎక్కువ చేస్తారు.. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎలాంటి చర్యలకైనా బాబు సిద్ధం అవుతారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.

ఇవి కూడా చదవండి: LPG Gas Prices: దీపావళి ముందే గ్యాస్ బండకు రెక్కలు.. రూ.100 వరకు పెరగొచ్చంటున్న మార్కెట్ వర్గాలు..

Covid Lockdown: థర్డ్ వేవ్ భయాలు.. దేశంలోని ఆ నగరంలో మళ్లీ లాక్‌డౌన్..