YSR: వైఎస్‌ విజయమ్మ నేతృత్వంలో ఇవాళ హైదరాబాద్‌లో YSR సంస్మరణ సభ.. టాలీవుడ్ హీరోలు సహా నేతల హాజరుపై సస్పెన్స్

మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా నేడు వైఎస్‌ విజయమ్మ హైదరాబాద్‌లో YSR సంస్మరణ సభ ఏర్పాటు

YSR: వైఎస్‌ విజయమ్మ నేతృత్వంలో ఇవాళ హైదరాబాద్‌లో YSR సంస్మరణ సభ.. టాలీవుడ్ హీరోలు సహా నేతల హాజరుపై సస్పెన్స్
Y.s Vijayamma

Updated on: Sep 02, 2021 | 8:03 AM

YS Vijayamma: మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్‌ విజయమ్మ నేడు హైదరాబాద్‌లో YSR సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. నోవాటెల్‌లో జరిగే ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమందిని ఆహ్వానించారు విజయమ్మ. అయితే ఈ సంస్మరణ సభకు ఎవరెవరు హాజరవుతారు..ఎవరు డుమ్మా కొడతారన్న దానిపైనే సస్పెన్స్‌ నెలకొంది.

కాగా, హైదరాబాద్‌ వైయస్ విజయమ్మ తలపెట్టిన వైఎస్‌ఆర్‌ సంస్మరణ సభ తెలుగు రాష్ట్రాల్లో హీటు పుట్టిస్తోంది. వైఎస్ విజయమమ్మ ఈ సభకు సంబంధించి పంపిన ఆహ్వానాలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి సందర్భంగా.. ఆయన కేబినెట్‌లో ఉన్న మంత్రులు, సన్నిహితంగా ఉండే నేతలు, మాజీ ఐపీఎస్, ఐఏఎస్ లు, టాలీవుడ్ పెద్దలకు విజయమ్మ ఆహ్వానాలు పంపిన సంగతి తెలిసిందే.

వైయస్ విజయమ్మ తనయి వైయస్ షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేసిన కొత్త పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేందుకే విజయమ్మ ఈ సంస్మరణ సభకి పూనుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఈ సంస్మరణ సభ ప్లాన్ చేసింది.. ఎవర ఎవరికి ఆహ్వానాలు అందించాలి అన్నది అంతా ప్రశాంత్ కిషర్ వ్యూహంలో భాగమని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నేడు వైఎస్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్‌లో మరికాసేపట్లో జరుగబోతోన్న ఆత్మీయ సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇక, ఈ సమావేశానికి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖుల్లో ఉమ్మడి శాసనమండలి మాజీ ఛైర్మన్‌ చక్రపాణి తోపాటు, ఉమ్మడి ఏపీలో స్పీకర్‌గా పనిచేసిన సురేష్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్‌తో పాటు మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, ఏపీ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ సినీవర్గం నుంచి హీరో నాగార్జునతోపాటు డైరెక్టర్లు పూరీ జగన్నాథ్‌, వీవీ వినాయక్‌ పేర్లు ఉన్నట్టు సమాచారం.

Read also: India Rains: భారీ వర్షాలతో రాజధాని సహా ఉత్తర భారతం భీతావహం.. అసోంలో 7 లక్షల మంది నిరాశ్రయులు