రేపటి నుంచి ప్రచారానికి విజయమ్మ, షర్మిల

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో షెడ్యూల్‌లో భాగంగా విజయమ్మ శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి.. కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఇక 30న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల్లోనూ.. 31న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లోనూ విజయమ్మ ప్రచారం సాగించనున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరి […]

రేపటి నుంచి ప్రచారానికి విజయమ్మ, షర్మిల

Edited By:

Updated on: Mar 28, 2019 | 6:42 AM

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో షెడ్యూల్‌లో భాగంగా విజయమ్మ శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి.. కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఇక 30న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల్లోనూ.. 31న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లోనూ విజయమ్మ ప్రచారం సాగించనున్నారు.

మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి షర్మిల తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో 30న గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల్లోనూ.. 31న గుంటూరు జిల్లా తాడికండ, పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల్లో షర్మిల ప్రచారం చేయనున్నారు.