YS Sharmila Warning : మహానేత, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డిని కించపరిచేలా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని షర్మిల అన్నారు. “ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత డాక్టర్ వైయస్ఆర్. ప్రజలు దేవుడితో సమానంగా కొలిచే నేత. మహానేతను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించేదిలేదు. తెలంగాణలో ఉన్న లక్షలాది వైయస్ఆర్ అభిమానులు మీకు తిరుగుబాటుతో సమాధానం చెప్తారు. ఖబడ్దార్” అని ఆమె హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ సహా, టీఆర్ఎస్ నేతలు మహానేత వైఎస్సార్ ను అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని ఆమె చెప్పుకొచ్చారు. వైయస్సార్ గురించి, ఆయన గొప్పదనం గురించి తెలుగు ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఆరోగ్య శ్రీ సృష్టికర్త వైఎస్సారేనని, అది మంచి పథకం కాబట్టే టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తొలగించలేదని షర్మిల వ్యాఖ్యానించారు.
మంచి పథకాన్ని తొలగించే ధైర్యం మీకు లేదు.. వైఎస్సార్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. మరోసారి చెబుతున్నా… వైఎస్సార్ మహానేత, మనసున్న నేత. మీలాగా కాదు… వైఎస్సార్ నిజమైన ప్రజల నేత. మరోసారి వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు అని షర్మిల అన్నారు.
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత డాక్టర్ వైయస్ఆర్. ప్రజలు దేవుడితో సమానంగా కొలిచే నేత. మహానేతను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించేదిలేదు. తెలంగాణలో ఉన్న లక్షలాది వైయస్ఆర్ అభిమానులు మీకు తిరుగుబాటుతో సమాధానం చెప్తారు. ఖబడ్దార్ pic.twitter.com/ZXWqp5vITf
— YS Sharmila (@realyssharmila) June 26, 2021
Read also : Bhatti : ‘ఒక దళిత ఎమ్మెల్యేగా నేను మౌనంగా ఉండలేనురా దుర్మార్గుడా..! శవాల మీద పేలాలు ఎరుకునే దౌర్భాగ్యుడా.!’