AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: షర్మిల – కాంగ్రెస్ చర్చలకు బ్రేక్.. దానికి ఒప్పుకుంటేనే విలీనం అంటున్న షర్మిల

గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల సైలెంట్ గా ఉంటున్నారు. కేవలం ట్విట్టర్ కే పరిమితమైన షర్మిల.. రాజకీయ ప్రస్థానంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీతో షర్మిలా చేస్తున్న చర్చలకు ఇప్పుడు కొత్త ఇబ్బంది వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతకు ష‌ర్మిల ఎదుట కాంగ్రెస్ పెట్టిన ప్రతిపాదన ఏంటి? కాంగ్రెస్ ముందు షర్మిల ఉంచుతున్న షరతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

YS Sharmila: షర్మిల - కాంగ్రెస్ చర్చలకు బ్రేక్.. దానికి ఒప్పుకుంటేనే విలీనం అంటున్న షర్మిల
Y S Sharmila
TV9 Telugu
| Edited By: |

Updated on: Aug 05, 2023 | 3:14 PM

Share

తెలంగాణ, ఆగస్టు 5:  గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల సైలెంట్ గా ఉంటున్నారు. కేవలం ట్విట్టర్ కే పరిమితమైన షర్మిల.. రాజకీయ ప్రస్థానంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీతో షర్మిలా చేస్తున్న చర్చలకు ఇప్పుడు కొత్త ఇబ్బంది వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతకు ష‌ర్మిల ఎదుట కాంగ్రెస్ పెట్టిన ప్రతిపాదన ఏంటి? కాంగ్రెస్ ముందు షర్మిల ఉంచుతున్న షరతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేరిక‌పై చ‌ర్చ సాగుతూనే ఉంది. కాంగ్రెస్‌లో చేరే విషయంపై కొన్ని కండీషన్స్‎తో బ్రేక్ లు పడ్డట్టు తెలుస్తుంది. ష‌ర‌తులే అడ్డంకిగా మారాయ‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభ‌వం తీసుకురావాల‌ని ష‌ర్మిల‌ను కాంగ్రెస్ అధిష్టానం కోరుతోంద‌ని అందుకు ఆమె మొదటి నుండి స‌సేమిరా అంటున్నార‌నేది బ‌హిరంగ ర‌హస్యమే.

రేవంత్ రెడ్డి కూడా షర్మిల ఆంధ్రలో ఏమైనా చేసుకోవచ్చు అంటూ బహిరంగ ప్రకటనలు చేయడం.. అదే విషయం అధిష్ఠానం వద్ద చెప్పడంతో ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ మధ్య జరగుతున్న చర్చలపై దాని ప్రభావం పడింది. కొంత కాలంగా త‌న పార్టీ కార్యక‌లాపాల‌కు కూడా ష‌ర్మిల దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌తో ఏదో ఒక‌టి తేల్చుకుని, ఆ త‌ర్వాతే క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలన్న ఆలోచనతో షర్మిల ఉన్నార‌ని స‌మాచారం. కాంగ్రెస్ పార్టీతో కలిసిది లేకపోతే మరో సారి పాదయాత్రతో పార్టీని ముందుకు నడిపించాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెల మూడో తారీకు నుంచి ఈ పాదయాత్ర మళ్ళీ మొదలవ్వాల్సి ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ప్రతిపాదన రావడంతో షర్మిల పాదయాత్ర ఆలోచనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది.

ష‌ర్మిల ఎదుట కాంగ్రెస్ ఒక కొత్తప్రతిపాద‌న పెట్టినట్టు స‌మాచారం. ష‌ర్మిల‌ను తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయించే ప్రతిపాదనను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆమెను సికింద్రాబాద్ లోక్‌స‌భ బ‌రిలో దింపాల‌నే ఆలోచ‌న‌తో కాంగ్రెస్ అధిష్టానం ఉంద‌ని తెలిసింది. ఈ మేర‌కు ఆమెతో మ‌రోసారి చ‌ర్చలు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. సికింద్రాబాద్ నుంచి ష‌ర్మిల‌ను బ‌రిలో దింప‌డానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా న‌డుచుకుంటోంది. సికింద్రాబాద్ లోక్‌స‌భ ప‌రిధిలో క్రిస్టియ‌న్ల ఓట్లు కీల‌కంగా ఉన్నాయి. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ష‌ర్మిల నిలిస్తే సులువుగా గెల‌వ‌డంతో పాటు సెటిల‌ర్స్, వైఎస్సార్ అభిమానులు, ఆమె సామాజికవ‌ర్గం ఓట్లను ప్రభావితం చేయగలుగుతారని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు స‌మాచారం. అయితే షర్మిల దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాలేరు నుంచి ఎట్టి పరిస్థితిలో పోటీ చేయాలని సిద్ధమవుతున్న వేళ ఆమె కార్యస్థలాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. అయితే కాంగ్రెస్ పార్టీతో చివరిదపా చర్చలు ప్రస్తుతం నడుస్తున్నాయి కనుక షర్మిల తన పాదయాత్రకు మళ్ళీ ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీ షర్మిల కండిషన్‌కు ఒప్పుకుంటే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. చూడాలి మరి షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏ దిశకు వెళ్లనుందో !!

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?