తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ విగ్రహాల అలంకరణకు పిలుపు, పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ

|

Jul 04, 2021 | 7:26 PM

8వ తేదీన నూతన పార్టీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివంగత నేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి విగ్రహాలను పూలతో అలంకరించాలని వైఎస్‌ విగ్రహాల పరిరక్షణ కమిటీ..

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ విగ్రహాల అలంకరణకు పిలుపు, పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ
Ysrtp
Follow us on

YSRTP Poster : వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావ ఉత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ ఈ ఉదయం జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోటస్‌పాండ్‌లోని షర్మిల కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ మహోత్సవానికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 8వ తేదీన నూతన పార్టీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివంగత నేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి విగ్రహాలను పూలతో అలంకరించాలని వైఎస్‌ విగ్రహాల పరిరక్షణ కమిటీ కోఆర్డినేటర్‌ నీలం రమేశ్‌ ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. ఇన్విటేషన్ ఉంటేనే JRC కన్వెన్షన్ లోకి ఎంట్రీ ఉంటుందని, ఒక్కో జిల్లా నుండి 2000 మందికి పైగా కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేత కొండా రాఘవ రెడ్డి వెల్లడించారు.

ఇక, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. హైదరాబాద్ ఫిల్మ్‌ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’గా పేరును ఖరారు చేశారు. సభకు సంబంధించి రోడ్డు మ్యాప్ తాజాగా ఖరారైంది. ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి బైరోడ్డు ఇడుపులపాయకు చేరుకోనున్నారు.

జూలై 8వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ప్రార్థనలు చేసిన అనంతరం కడప నుంచి ప్రత్యేక చాపర్‌లో 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్ షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు JRC కన్వెన్షన్‌కు చేరుకొని.. 5 గంటలకు వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు.

Read also : సిరిసిల్లలో బిజీ.. బిజీగా గడిపిన సీఎం.. ఓ వైపు చలోక్తులు, మరో వైపు అభివృద్ధి మాటలు, మరోచోట తీవ్ర అసహనం.!