పవన్ కల్యాణ్‌పై వైఎస్ జగన్ విసుర్లు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సెటైర్ల వర్షం కురిపించారు. ఆదివారం రాత్రి గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. “పవన్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఆయన నామినేషన్ వేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాలే కనిపించాయి. గాజువాకలో ఒక యాక్టర్‌కు-లోకల్ హీరోకు మధ్య పోటీ జరుగుతోంది. నాలుగేళ్లు టీడీపీతో పవన్ కాపురం చేసి సంవత్సరం ముందు విడాకులు తీసుకున్నట్లు […]

పవన్ కల్యాణ్‌పై వైఎస్ జగన్ విసుర్లు

Edited By:

Updated on: Apr 07, 2019 | 8:40 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సెటైర్ల వర్షం కురిపించారు. ఆదివారం రాత్రి గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. “పవన్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఆయన నామినేషన్ వేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాలే కనిపించాయి. గాజువాకలో ఒక యాక్టర్‌కు-లోకల్ హీరోకు మధ్య పోటీ జరుగుతోంది. నాలుగేళ్లు టీడీపీతో పవన్ కాపురం చేసి సంవత్సరం ముందు విడాకులు తీసుకున్నట్లు పవన్ బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడితే నా మీద 22 కేసులు పెట్టారు. పవన్ కళ్యాణ్ మీద మాత్రం కేసులు లేవు” అని జగన్ విమర్శల వర్షం కురిపించారు.