పెద్దపల్లి సభలో యోగి తీవ్ర విమర్శలు

పెద్దపల్లిలో నిర్వహించిన భాజపా ఎన్నికల బహిరంగ సభకు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హజరయ్యారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. గతంలో రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని మూసివేశారని, రూ.5,500 కోట్లతో దానిని పునరుద్ధరించామని తెలిపారు. దీనిద్వారా పెద్ద ఎత్తున ఉపాధి లభించిందన్నారు. కాంగ్రెస్‌, తెరాస పార్టీలు దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కవుతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ తీరు ఉగ్రవాదానికి ఊతం ఇచ్చే విధంగా ఉందని ఆరోపించారు. ఇటీవల విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోతో ఇది స్పష్టమైందని యోగి […]

పెద్దపల్లి సభలో యోగి తీవ్ర విమర్శలు

Edited By:

Updated on: Apr 07, 2019 | 4:44 PM

పెద్దపల్లిలో నిర్వహించిన భాజపా ఎన్నికల బహిరంగ సభకు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హజరయ్యారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. గతంలో రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని మూసివేశారని, రూ.5,500 కోట్లతో దానిని పునరుద్ధరించామని తెలిపారు. దీనిద్వారా పెద్ద ఎత్తున ఉపాధి లభించిందన్నారు. కాంగ్రెస్‌, తెరాస పార్టీలు దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కవుతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ తీరు ఉగ్రవాదానికి ఊతం ఇచ్చే విధంగా ఉందని ఆరోపించారు. ఇటీవల విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోతో ఇది స్పష్టమైందని యోగి అన్నారు.

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మజ్లీస్‌ను బలపర్చడమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తే, మోదీ ప్రభుత్వం బుల్లెట్లతో సమాధానం చెప్పిందని హర్షం వ్యక్తం చేశారు. ముస్లిములకు 12 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని యోగి అన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలి అని యోగి పేర్కొన్నారు.