Vijayasai reddy : తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకున్నప్పుడు చాలా మంది విచక్షణ కోల్పోతారు : విజయసాయిరెడ్డి

కనుచూపు మేరలో సానుకూలత కనిపించని పరిస్థితి. బాబు, ఆయన బానిస మీడియా శోకాలు పెట్టడం తప్ప చేయగలిగేదేం ఉంటుందని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా..

Vijayasai reddy :  తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకున్నప్పుడు చాలా మంది విచక్షణ కోల్పోతారు : విజయసాయిరెడ్డి
Vijayasai Reddy

Updated on: Jun 15, 2021 | 12:38 AM

YCP MP Vijayasai reddy : కనుచూపు మేరలో సానుకూలత కనిపించని పరిస్థితి. బాబు, ఆయన బానిస మీడియా శోకాలు పెట్టడం తప్ప చేయగలిగేదేం ఉంటుందని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ట్వీట్ వేదికగా మరోమారు ఆయన తెలుగుదేశంపార్టీ మీదా, అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపైనా తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలోని పేదల కోసం గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ చేపట్టిన గృహ నిర్మాణ యజ్ఞం జాతీయస్థాయిలో ప్రశంసలు పొందుతోందని విజయశాయి చెప్పుకొచ్చారు. . 17,005 కాలనీల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రపంచంలోనే అరుదు అని కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు . ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాజ‌కీయ భ‌విష్య‌త్‌ ముగిసిన అధ్యాయంగా ఆయన పేర్కొన్నారు. తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకున్నప్పుడు చాలా మంది విచక్షణ కోల్పోతారు. ప్రజల తిరస్కారంతో పొరుగు రాష్ట్రంలో ఆశ్రయం పొందిన మీకు ప్రతి ఎన్నికా చేదు జ్ఞాపకాలనే మిగిల్చిందంటూ చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు విజయసాయి.

Read also : Peddireddy : జూలై 8న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’, సర్పంచ్‌లతో మంత్రి వీడియో కాన్ఫెరెన్స్.. సీఎం మెచ్చేలాపేరు తెచ్చుకోండని సూచన