జనసేన ఆఫీస్‌ను శుభ్రం చేసే పనైనా చేస్తా: నాగబాబు

విజయవాడ: జనసేన పార్టీలో చేరిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యాలయంలో తనకు క్లీనింగ్ పని ఇచ్చినా చేసేందు సిద్ధమేనని అన్నారు. పవన్‌తో కూడా అదే మాట చెప్పానని తెలిపారు. పార్టీలో చేరకముందే ఎలాంటి బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధమయ్యానని అన్నారు. పవన్ కల్యాణ్‌ను తాను చిన్నప్పటి నుంచి చూశాననీ, ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండేవారని తెలిపారు. ఆ సమయంలో ఏం చేస్తున్నావ్ కల్యాణ్? అని ఇంట్లో ఎవరైనా […]

జనసేన ఆఫీస్‌ను శుభ్రం చేసే పనైనా చేస్తా: నాగబాబు

Updated on: Mar 20, 2019 | 2:55 PM

విజయవాడ: జనసేన పార్టీలో చేరిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యాలయంలో తనకు క్లీనింగ్ పని ఇచ్చినా చేసేందు సిద్ధమేనని అన్నారు. పవన్‌తో కూడా అదే మాట చెప్పానని తెలిపారు. పార్టీలో చేరకముందే ఎలాంటి బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధమయ్యానని అన్నారు.

పవన్ కల్యాణ్‌ను తాను చిన్నప్పటి నుంచి చూశాననీ, ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండేవారని తెలిపారు. ఆ సమయంలో ఏం చేస్తున్నావ్ కల్యాణ్? అని ఇంట్లో ఎవరైనా అడిగితే జవాబు చెప్పేవాడు కాదని నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్ పేరుకే తనకు తమ్ముడనీ, నిజానికి సాధారణ జనసేన కార్యకర్తల్లాగే తనకూ పవన్ నాయకుడని అన్నారు. తనను నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా నిలబెట్టి పవన్ గొప్ప గౌరవం ఇచ్చారని, అందుకు పవన్‌కు కృతజ్ఞతలని నాగబాబు చెప్పారు.