లక్ష్మీపార్వతి గళం వినిపించదే..? ఏదీ ఆ పొలిటికల్ వాయిస్..?

| Edited By:

Sep 19, 2019 | 12:30 PM

మీడియా ముందు హడావిడి చేసేవారిలో లక్ష్మీ పార్వతి ఒకరు. అలాంటి ఆవిడ గళం ఇప్పుడు వినిపించడం లేదు. గతకొన్ని వారాలుగా.. వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఏమయ్యారు..? మీడియాలో గానీ.. వార్తల్లో గానీ.. ఆమె ఊసేలేదు. అమరావతి రాజధానిపై దుమారం రేగినప్పుడు గానీ, జగన్ వందరోజుల పాలనపై గానీ, తాజాగా.. కోడెల మృతిపై గానీ.. ఆమె స్పందించిన దాఖలాలు కనబడలేదు. అసలు జగన్.. మంత్రివర్గ ఏర్పాటు నుంచే లక్ష్మీ పార్వతి ఊసు కనబడకుండా పోయింది. జగన్.. సీఎం కాకముందు […]

లక్ష్మీపార్వతి గళం వినిపించదే..? ఏదీ ఆ పొలిటికల్ వాయిస్..?
Follow us on

మీడియా ముందు హడావిడి చేసేవారిలో లక్ష్మీ పార్వతి ఒకరు. అలాంటి ఆవిడ గళం ఇప్పుడు వినిపించడం లేదు. గతకొన్ని వారాలుగా.. వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఏమయ్యారు..? మీడియాలో గానీ.. వార్తల్లో గానీ.. ఆమె ఊసేలేదు. అమరావతి రాజధానిపై దుమారం రేగినప్పుడు గానీ, జగన్ వందరోజుల పాలనపై గానీ, తాజాగా.. కోడెల మృతిపై గానీ.. ఆమె స్పందించిన దాఖలాలు కనబడలేదు. అసలు జగన్.. మంత్రివర్గ ఏర్పాటు నుంచే లక్ష్మీ పార్వతి ఊసు కనబడకుండా పోయింది. జగన్.. సీఎం కాకముందు పాదయాత్రలో అప్పుడప్పుడు పాల్గొన్న ఆమె.. రోజాతో ధీటుగా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ వచ్చింది. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మని నియమించినప్పుడు కూడా.. ఆమె స్పందన లేకుండా పోయింది.

మరి లక్ష్మీ పార్వతి ఏమైంది. అప్పుడప్పుడు.. మీడియాలలో డిబేట్‌లలో కనిపిస్తూ.. చంద్రబాబు ప్రభుత్వంపై.. ఆయనపై హాట్‌ హాట్ కామెంట్స్ గుప్పిస్తూ ఉండేవారు. మాజీ సీఎం చంద్రబాబు.. తనకు చేసిన ద్రోహాల గురించి కూడా.. ఎక్కువగా ప్రస్తావిస్తూండేవారు. అలాగే.. రాంగోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ చిత్రమప్పుడు ఏపీలో రచ్చరచ్చ జరిగిన విషయం తెలిసిందే. నిజానికి.. వర్మ.. లక్ష్మీపార్వతి గురించే.. ఆ సినిమా తీశారు. ఈ సినిమా విడుదలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఆ సమయంలో కూడా తీవ్రంగా తన వాణిని వినిపించారు.

ఏపీ రాజధానిపై, జగన్‌ వందరోజుల పాలనపై.. ఏపీలో రాజకీయాలు ఒకేసారి గుప్పుమన్నాయి. పవన్‌ కల్యాణ్ ఏకంగా.. బుక్‌ కూడా రాశారు. కనీసం.. సీఎం జగన్‌కు మద్దతుగా ఆమె ప్రకటిస్తున్న విషయం కూడా.. ఎక్కడా కనబడలేదు… వినబడలేదు. మరి ఆమె ప్రస్తుతం ఏం చేస్తున్నారు..? ఎప్పుడూ ఆక్టీవ్‌గా ఉండే ఆవిడ ఎందుకు సడన్‌గా సైలెంట్ అయిపోయారు. జగన్‌ సీఎం అయ్యాక.. ఆమెకు ఏదైనా పదవి ఇస్తారని అనుకున్నాం.. కానీ జగన్.. ఆమె పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ ఆ కారణం చేత ఆమె మనస్తాపం చెందారా..! అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

కోడెలకు, లక్ష్మీపార్వతికి రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నాయని అంటారు. ఆయన మరణంపై కూడా ఆమె స్పందించకపోవడంతో.. కొన్ని అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. అసలు ఎన్టీఆర్‌కు లక్ష్మీ పార్వతిని పరిచయం చేసింది.. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అని కొందరు అంటూంటారు. అలాంటి వ్యక్తిని కూడా ఆవిడ మర్చిపోయారా..? అన్న ప్రశ్నలు ఎదురవుతోన్నాయి. ఏదేమైనా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని రచ్చలు జరగుతోన్నా.. లక్ష్మీ పార్వతి సైలెంట్‌గా ఉండటం ఒకింత అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం.