Gangula : బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతోన్న పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు.? : గంగుల

|

Jul 23, 2021 | 2:50 PM

దేశంలోని మిగతా 28 రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఎందుకులేవని, బీజేపీ ప్రభుత్వాలు ఎందుకు వీటిని తీసుకురావడం లేదని ప్రశ్నించారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ..

Gangula : బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతోన్న పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు.? : గంగుల
Gangula Kamalakar
Follow us on

Gangula – Huzurabad : దేశంలోని మిగతా 28 రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఎందుకులేవని, బీజేపీ ప్రభుత్వాలు ఎందుకు వీటిని తీసుకురావడం లేదని ప్రశ్నించారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ రోజు హుజురాబాద్ సిటీ సెంటర్ హల్‌లో 68 మంది లబ్దిదారులకు 68 లక్షల రూపాయల విలువైన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీని మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రశ్నలు సంధించారు.

ఆడబిడ్డకు అండగా నిలబడే కళ్యాణలక్ష్మి, రైతు సాగుకు బరోసా ఇచ్చే రైతుబంధు, వెనుకబడిన వర్గాల పిల్లల్ని తీర్చిదిద్దే గురుకులాలు, నిరంతరంగా 24 గంటల కరెంటు, ఆత్మగౌరవం కాపాడే ఆసరా ఫించను, ఇంటింటికి మిషన్ భగీరథ నల్లాలు, అత్యద్భుతంగా దావాఖానాల్ని డెవలప్ చేయడమే కాక, 13 వేలు విలువచేసే కేసీఆర్ కిట్, ఇలా.. ఎన్నో పథకాలు ఎందుకు బీజేపీ పాలిత, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలుచేయడం లేదని గంగుల ప్రశ్నించారు. పేదింట్లో ఆడబిడ్డ పెళ్లి భారం కాకుడదని లక్ష రూపాయలకు పైగా మేనమామ కట్నంగా కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుందని గంగుల గుర్తు చేశారు.

కళ్యాణ లక్ష్మి కానుక అనంతరం కాన్పుకు అన్ని వసతుల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కల్పించడమేకాక, కేసీఆర్ కిట్‌తో తల్లి, బిడ్డలకు పౌష్టిక ఆహారాన్ని, ఆర్థిక భరోసాను ఇస్తున్న ఏకైక  రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. తర్వాత బిడ్డ పెరుగుతున్నప్పుడు కార్పొరేట్ చదువులకు ధీటుగా గురుకులాల్ని ఏర్పాటు చేసి ఇంగ్లీష్ అద్బుతంగా మాట్లాడే విధంగా విద్యార్థుల్ని తయారు చేస్తున్నామన్నారు. ఒకనాడు ఇబ్బందులతో, పైసలు లేక కూలీ పనులకు మన బిడ్డల్ని తీసుకుపోయామని.. కానీ నేడు గురుకులాల్లో, ప్రభుత్వ బడుల్లో చదివిస్తూ వాళ్లను ప్రయోజకులుగా, ఎంటర్ ప్రెన్యువర్లుగా తీర్చిదిద్దుకుంటున్నామన్నారు మంత్రి గంగుల.

Read also: Pushpa Srivani : పుట్టుకనే.. బాబు అవహేళన చేస్తే.. సీఎం జగన్‌ పక్షపాతిగా దేశానికే ఆదర్శమయ్యారు : పుష్పశ్రీవాణి