‘ వర్గ ‘ పోరులో మూడు నియోజకవర్గాలు..ఎవరిది ‘ కిరీటం ‘?

| Edited By: Ravi Kiran

May 16, 2019 | 2:54 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా మూడు నియోజకవర్గాలలో బరిలోకి దిగిన ముఖ్య  పార్టీల అభ్యర్థుల మార్పులు, చేర్పులు ఓటర్లను తికమక పెడుతున్నాయి. చివరి క్షణంలో అభ్యర్థుల మార్పుతో ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేక వారు హైరానా పడుతున్నారు. కొవ్వూరు, చింతలపల్లి, తాడేపల్లిగూడెం  నియోజకవర్గాల్లో  ఏర్పడిన విచిత్రమైన పరిస్థితి ఇది ! మొదట కొవ్వూరులో మంత్రి జవహర్ కి టీడీపీ టికెట్ ఇచ్చినా.. ఆ తరువాత ఆయనను తిరువూరుకు ‘ మార్చారు ‘. స్థానిక నేత పెండ్యాల అచ్చిబాబు […]

 వర్గ  పోరులో మూడు నియోజకవర్గాలు..ఎవరిది  కిరీటం ?
Follow us on

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా మూడు నియోజకవర్గాలలో బరిలోకి దిగిన ముఖ్య  పార్టీల అభ్యర్థుల మార్పులు, చేర్పులు ఓటర్లను తికమక పెడుతున్నాయి. చివరి క్షణంలో అభ్యర్థుల మార్పుతో ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేక వారు హైరానా పడుతున్నారు. కొవ్వూరు, చింతలపల్లి, తాడేపల్లిగూడెం  నియోజకవర్గాల్లో  ఏర్పడిన విచిత్రమైన పరిస్థితి ఇది ! మొదట కొవ్వూరులో మంత్రి జవహర్ కి టీడీపీ టికెట్ ఇచ్చినా.. ఆ తరువాత ఆయనను తిరువూరుకు ‘ మార్చారు ‘. స్థానిక నేత పెండ్యాల అచ్చిబాబు వర్గం వ్యతిరేకించడంతో.. ఆయన స్థానే వంగలపాటి అనితను రంగంలోకి దింపారు. ఇక చింతలపూడిలో సిటింగ్ ఎమ్మెల్యే పీతల సుజాతకు టికెట్ కేటాయించాలని తొలుత భావించినా.. ఆమెకు వ్యతిరేకంగా మండల స్థాయి నేతలు అధిష్టానం పై ఒత్తిడి తెచ్చారు. దీంతో కర్రా రాజారావుకు టికెట్ లభించింది. ఇదే అదనుగా పీతల వర్గంలో కొందరు వైసీపీలో చేరారు. మొత్తానికి చింతలపూడి రెండు వర్గాలుగా చీలిపోయింది. తాడేపల్లి విషయానికే వస్తే..కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈలినానికి టికెట్ లభించింది. అయితే ఇందుకు అలిగిన జెడ్పీచైర్మన్ బాపిరాజు ..ప్రచారానికి కొన్ని రోజులు దూరమయ్యారు. ఈయనకు మొదటి నుంచీ మద్దతు పలుకుతూ వస్తున్న తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆ తరువాత దూరమై  జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇలా తమ నేతలు ఎవరికి  వారు తమ వర్గాలతో ‘ దాగుడు మూత ‘ లాడడంతో.. ఓటర్లు అయోమయంలో పడుతున్నారు. వీళ్ళిలా గందరగోళంలో పడుతుండగా.. పందెం రాయుళ్ళు మాత్రం ఎవరు గెలుస్తారన్నదానిపై  జోరుగా లక్షల్లో పందాలు కాయడమే కొసమెరుపు.