
గుడివాడ: ఏం అర్హత ఉందని లోకేష్‌కు మూడు శాఖలున్న మంత్రి పదవిచ్చారని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళ. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్నికల ప్రాచారం సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారు. కానీ బాబు కుమారుడికి మాత్రమే జాబు వచ్చిందని అన్నారు.
ఒక్క ఎన్నికైనా గెలవకుండా, ఏ అనుభవం, అర్హత ఉందని లోకేశ్‌ను మూడు శాఖలకు మంత్రిని చేశారని షర్మిళ అన్నారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా అని చంద్రబాబును అడుగుతున్నా.. అంటూ షర్మిళ మాట్లాడారు. గుడివాడలో ఆమె నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పాల్గొన్నారు.