వ్యాక్సిన్ వచ్చింది, కానీ ఇప్పుడే కాదు, రెండు రోజులు ఆగండి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

| Edited By: Phani CH

May 01, 2021 | 7:19 PM

18-44  ఏళ్ళ మధ్య  వయస్సువారికి సోమవారం నుంచి వ్యాక్సినేషన్  ప్రారంభమవుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ప్రకటించారు.

వ్యాక్సిన్ వచ్చింది, కానీ ఇప్పుడే కాదు, రెండు రోజులు ఆగండి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Says Delhi Cm Arvind Kejriwal
Follow us on

18-44  ఏళ్ళ మధ్య  వయస్సువారికి సోమవారం నుంచి వ్యాక్సినేషన్  ప్రారంభమవుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ప్రకటించారు. అపాయింట్  ఉన్నవారు, ముందుగా రిజిస్టర్ చేసుకున్నవారు  మాత్రమే ఆక్సిజన్ సెంటర్లకు వెళ్లాలని  కోరారు. 4.5 లక్షల డోసుల వ్యాక్సిన్ అందిందని, దీన్ని వివిధ జిల్లాలకు పంపిణీ చేయాల్సి ఉంటుందని ఆయన  చెప్పారు.పెద్ద ఎత్తున టీకాల కార్యక్రమం సోమవారం నుంచి మొదలవుతుందని అన్నారు. మూడు నెలల్లోగా 67 లక్షల డోసుల చొప్పున కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకామందులు  వస్తాయని,  ఇందుకు తాము ఆర్దర్లు   పంపామని ఆయన వెల్లడించారు. ఆయా కంపెనీలతో తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు  సంప్రదింపులు జరుపుతోందని కేజ్రీవాల్ చెప్పారు. 18-44 -ఏళ్ళ మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్ శనివారం నుంచి ప్రారంభమవుతుందని  కేంద్రం ప్రకటించినా  పలు రాష్ట్రాలు  తమ వద్ద వ్యాక్సిన్  నిల్వలు లేవని తెలిపాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,  కేరళ సహా పలు రాష్ట్రాలు తాము శనివారం నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టలేమని పేర్కొన్నాయి. ఇక దేశంలో శనివారం నాటికి 4,01,993  కోవిడ్ కేసులు  నమోదయ్యాయి.24  గంటల్లో  3,523  మంది రోగులు మరణించారు.

ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో మరణించిన  రోగుల సంఖ్య 12 కి పెరిగింది. సుమారు గంటసేపు తమకు ఆక్సిజన్ అందలేదని, పలువురు రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. మొదట ఈ హాస్పిటల్ లో 8 మంది మృతి  చెందారని,వీరిలో ఓ డాక్టర్ కూడా ఉన్నారని  వార్తలు వచ్చాయి. ఈ  పరిణామాలపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించి ఇందుకు కేంద్రానిదే బాధ్యత .అని ఆరోపించింది.  ఇప్పటికైనా  ఆక్సిజన్ సరఫరాకు తక్షణమే  చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లేని పక్షంలో కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోబల్సి ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఇదే సమయంలో ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా దాదాపు ఇలాంటి పరిష్టితిని ఎదుర్కొంటున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: బిహార్ బాహుబలి..! గ్యాంగ్‌స్టర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఎదిగాడు.. కానీ కరోనాకు బలయ్యాడు..?

Mahesh And Trivikram: అత‌డు… ఖ‌లేజా.. మ‌రి ఇప్పుడు.? 11 ఏళ్ల త‌ర్వాత రిపీట్ కాబోతోన్న క్రేజీ కాంబినేష‌న్‌..