చిన్నాన్న హత్య విషయంలో అది మరీ ఆశ్చర్యం: జగన్

|

Mar 16, 2019 | 6:10 PM

హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో గవర్నర్ నరసింహన్‌‌కు జగన్ ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని ఫిర్యాదులో కోరినట్టు తెలిపారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. ఏదైనా జిల్లాలో ఒక ఎస్పీకి పోస్టింగ్ ఇస్తే రెండేళ్ల పాటు ట్రాన్స్‌ఫర్ ఉండకూడదు. కానీ కడప జిల్లాలో ఆ రూల్‌ను పక్కన పెట్టేసి 40 రోజుల కిందటే పాత ఎస్పీని మార్చేసి కొత్త ఎస్పీని, ఇప్పుడున్న ఎస్పీని తీసుకొచ్చారు. పాత ఎస్పీ తమ మాట వినడనే […]

చిన్నాన్న హత్య విషయంలో అది మరీ ఆశ్చర్యం: జగన్
Follow us on

హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో గవర్నర్ నరసింహన్‌‌కు జగన్ ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని ఫిర్యాదులో కోరినట్టు తెలిపారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. ఏదైనా జిల్లాలో ఒక ఎస్పీకి పోస్టింగ్ ఇస్తే రెండేళ్ల పాటు ట్రాన్స్‌ఫర్ ఉండకూడదు.

కానీ కడప జిల్లాలో ఆ రూల్‌ను పక్కన పెట్టేసి 40 రోజుల కిందటే పాత ఎస్పీని మార్చేసి కొత్త ఎస్పీని, ఇప్పుడున్న ఎస్పీని తీసుకొచ్చారు. పాత ఎస్పీ తమ మాట వినడనే కారణంతోనే కొత్త ఎస్పీని ప్రభుత్వం తెచ్చుకుందని జగన్ ఆరోపించారు. డీజీపీ, అడిషనల్ డీజీని మార్చాలని గవర్నర్‌ను కోరాం. ఎన్నికల బాధ్యతల నుంచి వీరిని తప్పించాలని జగన్ డిమాండ్ చేశారు.