మోదీపై ‘సై’ అంటోన్న విశాఖ యువకుడు

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీ చేస్తోన్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి మోదీ బరిలో ఉండగా.. ఆయనపై పోటీకి నిజామాబాద్ నుంచి 40మంది పసుపు రైతులు సిద్ధమయ్యారు. అయితే చివరకు 25మంది రైతులు నామినేషన్ వేసినా.. 24 నామినేషన్లు తిరస్కరణకు గురౌవ్వడంతో.. ఒకే ఒక్క రైతు బరిలో మిగిలాడు. కాగా తాజాగా మోదీపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు విశాఖపట్టణానికి చెందిన మానవ్ అనే యువకుడు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా వారణాసి నుంచి మానవ్ బరిలోకి దిగనున్నాడు. […]

మోదీపై ‘సై’ అంటోన్న విశాఖ యువకుడు

Edited By:

Updated on: May 03, 2019 | 11:46 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీ చేస్తోన్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి మోదీ బరిలో ఉండగా.. ఆయనపై పోటీకి నిజామాబాద్ నుంచి 40మంది పసుపు రైతులు సిద్ధమయ్యారు. అయితే చివరకు 25మంది రైతులు నామినేషన్ వేసినా.. 24 నామినేషన్లు తిరస్కరణకు గురౌవ్వడంతో.. ఒకే ఒక్క రైతు బరిలో మిగిలాడు. కాగా తాజాగా మోదీపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు విశాఖపట్టణానికి చెందిన మానవ్ అనే యువకుడు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా వారణాసి నుంచి మానవ్ బరిలోకి దిగనున్నాడు. కాగా గత నెలలో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మానవ్ పోటీ చేశాడు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి అతడు ఇంటిపెండెంట్‌గా బరిలో నిలిచాడు.