Vijayashanthi : ఈటల ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలోకి వెళతానంటే ఎందుకంత హైరానా? : విజయశాంతి

|

Jun 04, 2021 | 10:17 PM

మతతత్వ ఎంఐఎంతో అవగాహన కొనసాగితే అది సెక్యులరిజం... కోట్లాది భారతీయుల ఆదరణతో ప్రపంచంలోనే పెద్ద పార్టీగా ముందుకెళ్తున్న బీజేపీలో చేరటం మాత్రం అలౌకిక వాదమా?..

Vijayashanthi : ఈటల ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలోకి వెళతానంటే ఎందుకంత హైరానా? : విజయశాంతి
Vijayashanthi
Follow us on

Vijayashanthi : ఈటల ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలోకి వెళతానంటే టీఆర్ఎస్ వాళ్లకు ఎందుకంత హైరానా? అంటూ ప్రశ్నించారు సినీనటి, బీజేపీ మహిళా నేత విజయశాంతి. వరుస ట్వీట్లలో ఆమె టీఆర్ఎస్ సర్కారు మీద విమర్శలు గుప్పించారు. “సీఎం గారి కుటుంబ దోపిడీ కథలు వేరే అధికారులొస్తే బయటపడతాయని భయమేదైనా ఉందా? కాంగ్రెస్ నుంచి గెలిచిన అనేకమంది ఎమ్మెల్యేలను పదవితో సహా గుంజుకున్న టీఆరెస్… ఈటలగారు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరతానంటే ఎందుకు ఇంత ఆగమైతున్రు?” అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. “నక్సలైట్ ఎజెండా నా ఎజెండా…” అని చెప్పిన కేసీఆర్ గారు, వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌లను ఎన్‌కౌంటర్ చెయ్యొచ్చు… సీఎం అండ్ కో వేల ఎకరాల, లక్షల కోట్ల అవినీతికి పాల్పడవచ్చు. ఈటల భావజాలం మాత్రం ప్రశ్నిస్తామంటున్న టీఆరెస్ పార్టీకి… ఇదంతా కేవలం బీజేపీలో చేరికపై భయంతోనే అన్నది స్పష్టం. రైతు చట్టాలపై ఈటలగారు బీజేపీతో మాట్లాడాలంటున్న టీఆరెస్… ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ రైతులనెందుకు పలుకరించలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి.” అని ఆమె డిమాండ్ చేశారు.

“టీఆరెస్ బాజాప్తాగా మతతత్వ ఎంఐఎంతో అవగాహన కొనసాగితే అది సెక్యులరిజం… కోట్లాది భారతీయుల ఆదరణతో ప్రపంచంలోనే పెద్ద పార్టీగా ముందుకెళ్తున్న బీజేపీలో చేరటం మాత్రం అలౌకిక వాదమా? ఇది కేవలం మెజారిటీ హిందువుల పట్ల టీఆరెస్ తేలిక భావమే.” అని ఆమె అన్నారు. “సీఎంఓలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు లేరన్న ఈటల గారి ప్రకటనపై ముందుగా ఎందుకు చెప్పలే…. అని టీఆరెస్ ప్రతి విమర్శలు చేసే బదులు, వెంటనే నియామకం చెయ్యవచ్చు. సమర్థులైన ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు ఉన్నారు కదా?” అంటూ టీఆర్ఎస్ సర్కారుని నిలదీసే ప్రయత్నం చేశారు విజయశాంతి.

Read also : Vasireddy Padma : లైంగిక వేధింపులపై మహిళా కమిషన్‌ ఆగ్రహం, వైద్యవృత్తికి మచ్చతెచ్చేలా ఉందన్న వాసిరెడ్డి పద్మ