తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 20 ఏళ్లయిన సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్‌లో ద్విశతాబ్ది ఉత్సవాన్ని, పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత అమరవీరులకు, ఈ మధ్య కాలంలో మరణించిన నేతలకు నివాళులర్పించారు. పార్టీ అధ్యక్షుడిగా 9వ సారి కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు నేతలు. తనకీ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు కేసీఆర్. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ప్లీనరీలో ఏడు తీర్మానాల ప్రవేశపెట్టి ఆమోదించారు. అధ్యక్షులకు అభినందన, టీఆర్‌ఎస్ ప్రభుత్వ విజయాల తీర్మానంపై చర్చ జరిగింది.
సంక్షేమ రంగంపై సుదీర్ఘంగా చర్చించారు నేతలు. ఆ తర్వాత ఐటీ రంగంలో అభివృద్ధిపై తీర్మానాన్ని కేటీఆర్ ప్రవేశపెట్టారు. విద్యుత్ రంగంలో అభివృద్ధిపైనా చర్చ జరిగింది. దళిత బంధుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. దశల వారీగా అన్ని వర్గాల వారికీ ఈ తరహా పథకాన్ని అమలు చేస్తామని హామీనిచ్చారు సీఎం కేసీఆర్.
మరోవైపు పలు అంశాలపై కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీసీ జనగణన చేయాలని, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ చేసిన తీర్మానాలను ఆమోదించాలని కోరారు. బీసీలకు కేంద్రమంత్రిత్వ శాఖను పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇంకో వైపు పార్టీ బైలాస్‌లో కొన్ని కీలక మార్పులు చేశారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల కార్యవర్గాన్ని నియమించే అధికారం అధ్యక్షుడికే అప్పగిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అధ్యక్షుడు అందుబాటులో లేనప్పుడు ఆయన బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ చూసేలా సవరణ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ మధ్య మధ్యలో మాట్లాడారు. దళిత బంధుపై బాగా మాట్లాడారంటూ మెతుకు ఆనంద్‌ను మెచ్చుకున్నారు సీఎం కేసీఆర్.
ప్లీనరీ వేదికగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. CEC తన పరిధి దాటి వ్యవహరిస్తోందన్నారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. దళిత బంధు తర్వాత ఏపీలోనూ పార్టీ పెట్టాలని విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. ఇప్పుడు ఏపీలో విద్యుత్ లేదు కానీ తెలంగాణలో మాత్రం 24 గంటల కరెంట్ ఉందన్నారు. కీలక అంశాలపై ప్లీనరీ వేదికగా మాట్లాడారు సీఎం కేసీఆర్.
ఇవి కూడా చదవండి: Amit Shah: జమ్ము కశ్మీర్‌లో అమిత్ షా సాహస నిర్ణయం.. బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ తొలిగింపు..
Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. ఐదేళ్ల క్రితం ధోని ఏం చెప్పాడో ఇప్పుడు అచ్చు అలాగే జరిగింది..