YS Sharmila: వైఎస్ షర్మిలను కలిసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కుమారుడు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

|

Feb 21, 2021 | 1:03 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌‌ఆర్ కుమార్తె, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి సోదరి వైఎస్‌ షర్మిల తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

YS Sharmila: వైఎస్ షర్మిలను కలిసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కుమారుడు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
Follow us on

YS Sharmila: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌‌ఆర్ కుమార్తె, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి సోదరి వైఎస్‌ షర్మిల తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా హైదరాబాద్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమై.. చర్చలు జరిపారు.  తెలంగాణలో పార్టీ పెట్టడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు. ఇటీవల సమావేశంలో ఆమె జై తెలంగాణ.. జోహార్ వైఎస్సార్ అంటూ చేసిన నినాదాలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి. కాగా తాజాగా టీఆర్ఎస్ చేవేళ్ల  ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు రవికాంత్… షర్మిలను కలిశారు.

రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలు, పలు అంశాలపై ఎమ్మెల్యే కుమారుడితో షర్మిల చర్చించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు వైఎస్ షర్మిలను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read:

తూర్పుగోదావరి జిల్లాలో కలకలం.. వింతవ్యాధితో మేకలు మృత్యువాత.. ‘పొట్ట ఉబ్బి, నురగలు కక్కుతూ’

బైక్‌లోకి దూరిన పాము ముప్పుతిప్పలు పెట్టింది.. పార్ట్స్ మొత్తం విడదీయాల్సి వచ్చింది.. చివరకు