Huzurabad by-poll: ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. గేర్ మార్చిన టీఆర్‌ఎస్

|

Oct 16, 2021 | 8:09 PM

సరిగ్గా 2 వారాలు. హుజురాబాద్ పొలిటికల్‌ లీగ్‌కు మిగిలున్న సమయం ఇది. అందుకే పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తోంది అధికార టీఆర్‌ఎస్.

Huzurabad by-poll: ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. గేర్ మార్చిన టీఆర్‌ఎస్
Trs Huzurabad By Poll
Follow us on

ఇప్పటి వరకు ఒక లెక్క. ఇకపై మరో లెక్క. ! ఈ రెండు వారాలు మోతమోగాల్సిందే. సభలతో హోరెత్తించాల్సిందే. హుజురాబాద్‌ ఉపయద్ధంపై గులాబీదళం ప్లానింగ్ ఇది. ఇప్పటికే ప్రచార బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఇప్పుడు మరికొందరిని సీన్‌లో దింపుతోంది. ఆదివారం జరిగే TRS శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లి, పార్లమెంట్ ప్రతినిధుల సమావేశంలో మరికొందరికి క్యాంపేనింగ్ బాధ్యతలు అప్పగించనున్నారు సీఎం కేసీఆర్.  మండ‌లానికి ముగ్గురు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, MLCలు ప‌నిచేస్తున్నారు. గ్రామగ్రామాన పర్యటిస్తున్నారు. ఇక మంత్రి హ‌రీష్‌రావు పూర్తిస్థాయిలో హుజురాబాద్‌లోనే మకాం వేశారు. అన్నీతానై బాధ్యతలు తీసుకున్నారు. అయినా ఎందుకో అక్కడ టైట్‌ ఫైట్ నడుస్తోంది. ఈటలకు లోక‌ల్‌గా గ‌ట్టి ప‌ట్టు ఉండటం, ఆరు సార్లు గెలిచిన నేత‌గా ప్రజలతో వ్యక్తిగత ప‌రిచ‌యాలు ఉండడం, BJP కూడా ఎన్నిక‌ని సీరియ‌స్‌గా తీసుకోవ‌డంతో ట‌గ్ అఫ్ వార్ న‌డుస్తోంది. మెద‌ట్లో TRS కొంత బ‌లహీనంగా ఉన్నా… సీఎం KCR స్వయంగా ఫోకస్ చేసి.. ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని అక్కడ అమలు చేయడం.. స‌భ‌ కూడా నిర్వహించడంతో పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది.

ఈ రెండు వారాలూ ఇంఛార్జ్‌ ఎమ్మెల్యేల‌తో పాటు, మంత్రులు, ఎంపీలు కూడా హుజురాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రతి మండలంలో రెండు మూడు స‌మావేశాలు ఉండేలా పార్టీ ప్లాన్ చేస్తోంది. ప్రతి గ్రామాన్ని టచ్‌ చేయడం..కుల సంఘాలు, మహిళా గ్రూపుల‌తో మళ్లీ సమావేశాలు.. మంత్రుల రోడ్‌షోలు ఉండేలా ప్రణాళికలు రెడీ అయిపోయాయి. ఇక ఫైనల్‌ టచ్‌గా CM KCR స‌భ కూడా ఉంటుందని సమాచారం. అయితే ఎన్నికల కోడ్‌ కారణంగా అనుమతి రాకపోతే..సభను హుస్నాబాద్‌కు షిఫ్ట్‌ చేయాలని భావిస్తున్నారు. మెత్తంగా సోమ‌వారం నుంచి హుజురాబాద్ స‌మ‌రం మరో రేంజ్‌కు వెళ్లనుంది.

Also Read: పండుగ తర్వాత భారీ విద్యుత్ కోతలంటూ ఏపీలో ప్రచారం.. ఇందన శాఖ క్లారిటీ

 వాక్సిన్ వేసుకున్న వారికే మద్యం.. లబోదిబోమంటున్న మందుబాబులు