చాలా మంది ట్రెండ్‌ను ఫాలో అవుతారు. కాని కొందరు మాత్రమే ట్రెండ్ సెట్ చేస్తారు. రాజకీయాల్లో కూడా అరుదుగానే ట్రెండ్ సెట్టర్స్ కనిపిస్తారు. తెలంగాణ రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా అయనే ట్రెండ్ సెట్టర్. యస్.. దటీజ్ సీఎం కేసీఆర్. అయన ఏం చేసినా వినూత్నమే… మెదట అసాధ్యం అనిపించేలా అయన పథకాలుంటాయి.. తర్వాత అందరు ఫాలో అయ్యేలా రిజల్ట్ ఉంటుంది. పరిపాలనలో అయినా రాజకీయాల్లో అయినా… తాజాగా అన్నిపార్టీలు జై భిమ్ నినాదం ఎత్తుకునేలా ఎత్తులు వేసి సక్సెస్ అయ్యారు గులాబి బాస్…
కేసీఆర్ 2001లో తెలంగాణ నినాదం ఎత్తుకున్నప్పుడు అంతా రాజకీయ పబ్బం కొసం కొత్త వేదిక అనుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి కూడా లైట్ తీసుకుంది తెలంగాణ ఉద్యమాన్ని… కాని కొద్ది రోజులకే అన్ని పార్టీలు తెలంగాణ అంశాన్ని తమ ఎజెండాలో పెట్టుకునే దశకు తీసుకెళ్లారు ఉద్యమనేత కేసీఆర్. పార్టీలకతీతంగా నేతంలందరితో జై తెలంగాణ అనిపించారు.
24 గంటల ఉచిత కరెంట్‌ను అన్నప్పుడు ఇది అసాధ్యం అన్నవాళ్లే అంతా. అప్పుడున్న తెలంగాణ పరిస్థితి కూడా అలాంటిదే. కాని దాన్ని సుసాధ్యం చేస్తూ గత ఏడేళ్లుగా కరెంటు అందింస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరెంటు పేరుతో ఉధ్యమాలు జరిగిన తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ అంశం కరంట్ టాపిక్‌లో లేకుండా పోయింది. చాలా రాష్ట్రాలు విద్యుత్ విషయంలో కేసీఆర్‌ను ఫాలో అయ్యాయి.
ఇక దేశంలోనే సంచలనంగా మారిన రైతుబంధు పథకంలో ఖచ్చితంగా కేసీఆర్ ట్రెండ్ సెట్టర్. ఎకరాకు పదివేలు ఇవ్వడం సాధ్యంకాని పనంటూ కొట్టిపారేసిన వాళ్లంతా నోర్లు వెల్లబెట్టుకునేలా రైతు బంధు అమలుచేస్తున్నారు సిఎం కేసీఆర్. అంతేకాదు రైతు బందును అధ్యయనం చేసి ఒరిస్సా, అంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలే కాదు…ఏకంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా రైతు పెట్టుబడి సాయాన్ని అమలుచేస్తుంది.
దళిత బంధు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిన మరో సంచలన పథకం. దళిత బంధు కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదు ఇదొక ఉద్యమం అంటూ కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ జై భీమ్ అనడంతో అటు ప్రతిపక్షాలు కూడా ఆ నినాదాన్ని ఎత్తుకున్నాయి. కాంగ్రెస్ దళిత దండోరా ప్రకటించింది. మరోవైపు అర్ ఎస్ ప్రవీణ్ కూడా అదే ఎజెండాతో బిఎస్పితో చేరారు. బిజెపి కూడా దళిత సంక్షేమంపై అంశాల వారిగా ఎజెండా రూపొందించుకుంటుంది. ఇలా తెలంగాణలో రాజకీయ వ్యవస్థ మెత్తాన్ని జై భీమ్ బాట పట్టించారు కేసీఆర్. ఇలా తమకు అనుకూలంగా ట్రెండ్ సెట్ చేసుకోవడం కెసిఅర్ స్ట్రాటజీ. అనివార్యంగా రాజకీయ పార్టీలను తమ దారీలోకి వచ్చేలా చేయడంలో అయన దిట్టగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read..
ఎమర్జెన్సీ వీసాలు జారీ చేసిన భారత హోంశాఖ.. అఫ్ఘాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 142మంది ప్రవాసులు
SBI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..