AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుజనా చౌదరిలో ఊహించని ఛేంజ్..! రీజన్ అదేనా..?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు..ఎన్నిసార్లు యూజ్ చేసిన వెగటు వేయని సామెత ఇది. దాన్ని పలుచన చెయ్యడానికి ఏ పొలిటిషియన్స్ ఇష్టపడటం లేదు. అలానే ఎంపీ సుజనా చౌదరి ఊహించని విధంగా టీడీపీ నుంచి బీజేపీలోకి జంఫ్ అయ్యారు. పనిలో పనిగా సహచరుల మెడలో కాషాయ కండువా వేయించి..చంద్రబాబుకు ఓ రేంజ్ షాక్ ఇచ్చారు. అయితే పార్టీ మారిన దగ్గర్నుంచి సుజానాలో ఛేంజ్ స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఆయన టీడీపీలో ఉన్నా కూడా ఎన్నికల […]

సుజనా చౌదరిలో ఊహించని ఛేంజ్..! రీజన్ అదేనా..?
Ram Naramaneni
| Edited By: |

Updated on: Oct 19, 2019 | 6:30 AM

Share

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు..ఎన్నిసార్లు యూజ్ చేసిన వెగటు వేయని సామెత ఇది. దాన్ని పలుచన చెయ్యడానికి ఏ పొలిటిషియన్స్ ఇష్టపడటం లేదు. అలానే ఎంపీ సుజనా చౌదరి ఊహించని విధంగా టీడీపీ నుంచి బీజేపీలోకి జంఫ్ అయ్యారు. పనిలో పనిగా సహచరుల మెడలో కాషాయ కండువా వేయించి..చంద్రబాబుకు ఓ రేంజ్ షాక్ ఇచ్చారు. అయితే పార్టీ మారిన దగ్గర్నుంచి సుజానాలో ఛేంజ్ స్పష్టంగా కనిపిస్తోంది.

గతంలో ఆయన టీడీపీలో ఉన్నా కూడా ఎన్నికల సమయాల్లో తప్ప పెద్ద యాక్టీవ్‌గా కనిపించేవారు కాదు. ఫైనాన్షియల్‌గా పార్టీకి తోడ్పాటునందించడం..అందుకు రిటర్న్‌గా ప్రతిఫలం పొందడం అప్పట్లో ఆయన స్టైల్. అలానే అప్పుడప్పుడు పార్టీ కోసం ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించి కీలక సమయాల్లో వార్తల్లో నిలిచేవారు. అంతేకానీ పార్టీ కండువా బుజాన వేసుకోని..జెండాకర్ర పట్టుకోని కష్టపడ్డ సందర్బాలు మాత్రం చాలా రేర్.

కానీ ఇప్పుడు సుజానా చౌదరి పూర్తిగా మారిపోయారు. బయటకొస్తే చాలు..మెడలో కాషాయ కండువా దర్శనమిస్తోంది. ఇక ప్రెస్‌మీట్స్, పబ్లిక్ ఫంక్షన్స్ సరేసరి. ఇక ర్యాలీలలో ఏకంగా జెండా కర్రనే బుజనా వేసుకోని బయలుదేరుతున్నారు. అంతేకాదు పార్టీ సభ్యత్వాలను కూడా దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు.  ఇదంతా ఎందుకు అంటే ఆ కిటుకు అందరికి తెలిసిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జాతీయ పార్టీ అయిన బిజేపీలో పదవులు దక్కాలంటే ఇంకా కష్టపడాలని లెక్చర్లు ఇస్తున్నారు.

మాములుగా అయితే బీజేపీలో సంఘ్ నుంచి వచ్చినవాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వారు ఒక డెడికేషన్‌తో పనిచేస్తారు..ప్రలోభాలకు, ప్రభావాలకు లొంగరని బయట టాక్ ఉంది. అందుకే మెజార్టీ పదువుల్లో వారే ఉంటారు. ఇక అనివార్య పరిస్థితుల్లో..రాజకీయాలను ప్రభావితం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే బీజేపీలో బయటవాళ్లకి పదవులు కేటాయిస్తారు. సుజనా చౌదరి తాను పార్టీ మారడమే కాదు..ఏకంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీనే బీజేపీలో విలీనం అయ్యేలా చక్రం తిప్పారు. ఇక రాజ్యసభలో అధికార బీజేపీ ప్రవేశపెట్టిన కొన్ని బిల్లులు పాసయ్యేందుకు కూడా సుజానా గేమ్ ప్లే చేశారని వార్తలు వినిపించాయి. ఆ రకంగా బీజేపీ పెద్దల నమ్మకం చూరగొన్నారు.  ఈ సారి మోదీ కేబినెట్ విస్తరణ చేపట్టినప్పుడు ఏపీ కోటాలో సుజనా మంత్రి పదవి ఆశించే లిస్టులో ఉన్నారట. అందుకే కొత్త రాజకీయానికి తెరలేపారని టాక్ నడుస్తోంది.

వాస్తు: ఇంట్లోని ఈ ప్రదేశాలలో అద్దాలు ఉంచకూడదు, అలా చేస్తే చిక్కు
వాస్తు: ఇంట్లోని ఈ ప్రదేశాలలో అద్దాలు ఉంచకూడదు, అలా చేస్తే చిక్కు
ఆసుపత్రి నుంచి రూమ్‌కు వెళ్లిన డాక్టర్.. కాసేపటికే..
ఆసుపత్రి నుంచి రూమ్‌కు వెళ్లిన డాక్టర్.. కాసేపటికే..
కార్యకర్త కోసం అర్థరాత్రి ఆస్పత్రికి పరిగెత్తిన హోమ్ మంత్రి అనిత!
కార్యకర్త కోసం అర్థరాత్రి ఆస్పత్రికి పరిగెత్తిన హోమ్ మంత్రి అనిత!
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఈ నాలుగు స్టేషన్లకు కొత్త హంగులు
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఈ నాలుగు స్టేషన్లకు కొత్త హంగులు
కుబేరుడి అనుగ్రహం.. ఈ తేదీల్లో జన్మించిన వారి ఇంట సిరులపంట!
కుబేరుడి అనుగ్రహం.. ఈ తేదీల్లో జన్మించిన వారి ఇంట సిరులపంట!
బాంబులా పేలుతున్న మైక్రోవేవ్‌లు! ఈ ఫుడ్‌ తయారీ విషయంలో జాగ్రత్త..
బాంబులా పేలుతున్న మైక్రోవేవ్‌లు! ఈ ఫుడ్‌ తయారీ విషయంలో జాగ్రత్త..
IND vs NZ: కోహ్లీ విశ్వరూపం చూసేందుకు సిద్ధమా..?
IND vs NZ: కోహ్లీ విశ్వరూపం చూసేందుకు సిద్ధమా..?
విశ్వాసానికి ప్రతీక సోమనాథ్‌ ఆలయం.. ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం
విశ్వాసానికి ప్రతీక సోమనాథ్‌ ఆలయం.. ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం
సమ్మెకు పిలుపునిచ్చిన సంఘాలు.. వరుసగా మూడు రోజులు బ్యాంక్‌లు బంద్
సమ్మెకు పిలుపునిచ్చిన సంఘాలు.. వరుసగా మూడు రోజులు బ్యాంక్‌లు బంద్
అభిమానులకు బిగ్ షాక్.. విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్..
అభిమానులకు బిగ్ షాక్.. విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్..